ASBL Koncept Ambience

ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ లు ఎవరు?

ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ లు ఎవరు?

తెలంగాణ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌లుగా ఎవరు నిలవనున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సరి లేకపోతే పరిస్థితి ఎట్లా, ఒకవేళ పరిస్థితులు విపక్షానికి అందివచ్చి మెజారిటీ వస్తే కూటమిలో ఎవరు కింగ్‌మేకర్‌గా నిలుస్తారు. ఓటింగ్‌కు ముందు తెలంగాణలో నెలకొన్న పరిస్థితి ఇది. శత్రువుల్లా మెలగుతున్న మజ్లిస్‌, బిజెపి ఈ ఎన్నికల్లో తాము కింగ్‌మేకర్‌లు అవుతామని కలలు కంటోంది. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగాయి.

ఇప్పటివరకూ ఓల్డ్‌ సిటీకే పరిమితమైన మజ్లిస్‌ పార్టీ.. రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో కింగ్‌ మేకర్‌ కావాలని భావిస్తోంది.  ఈ పార్టీ కాస్త.. అడుగు బయటపెట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది. ప్రతిసారీ నిర్దిష్టంగా ఏడు స్థానాలను గెలిచే ఎంఐఎం.. ఈసారి ఆ సంఖ్యను పెంచుకుని.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావాలని చూస్తోంది. ఆ దిశగా ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ చేస్తున్నప్పటికీ.. గ్రేటర్‌ పరిధిలో మాత్రం సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించి సత్తా చాటాలని మజ్లిస్‌ భావిస్తోంది.అటు, భారతీయ జనతాపార్టీ సైతం ఈసారి తెలంగాణలో కీ రోల్‌ పోషించాలని ఉవ్విళ్లూరుతోంది. పైకి టీఆర్‌ఎస్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే టార్గెట్‌ మరోలా ఉందనిపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపి.. విస్త త ప్రచారం చేస్తోంది బీజేపీ. అటు అధికార పార్టీని, ఇటు మహాకూటమిని విమర్శిస్తూ ప్రచారాన్ని వేడెక్కిస్తోంది. అంతేకాదు, ఇంత భారీస్థాయిలో కేంద్రపెద్దలంతా వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఇంతకుముందెప్పుడూ జరగలేదు. ఈ లెక్కన, ఎన్నికల్లో 10 నుంచి 15 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని బీజేపీ భారీ స్కెచ్చే వేసినట్టు తెలుస్తోంది.ప్రచారంలో ఈ రెండు పార్టీల దూకుడు చూస్తుంటే.. కింగ్‌ మేకర్లుగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అనుకున్నట్టుగా వీలైనన్ని స్థానాలు దక్కించుకోగలిగితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని.. ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే మజ్లిస్‌ తరపున ఓవైసీ బ్రదర్స్‌ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌పై ఫోకస్‌ పెట్టారు.

బీజేపీ సైతం కేంద్రనాయకత్వాన్ని రాష్ట్రంలో భారీగా మోహరించి ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వరుస పర్యటనలతో పార్టీక్యాడర్‌లో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, స్మ తి ఇరానీ, నితిన్‌ గడ్కరీ సహా పలువురు ప్రధాననేతలు ఎన్నికల ప్రచారంలో విస్త తంగా పాల్గొంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, రమణ్‌ సింగ్‌ కూడా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని నిర్వహించారు. ఇంతటి భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించడం కూడా బీజేపీ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. మరి, ఈ వ్యూహాలు ఫలించి ఈ రెండుపార్టీలు కింగ్‌ మేకర్లుగా అవతరిస్తాయా? లేదా? అనేది తెలియాలంటే ఫలితాలు వెలువడే దాకా ఎదురుచూడాల్సిందే.

 

Tags :