మిల్‌పిటాస్‌లో తానా ఆధ్వర్యంలో విల్-ట్రస్ట్ ఎస్టేట్ ప్లానింగ్ సదస్సు
కాలిఫోర్నియాలో తానా వెస్ట్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విల్-ట్రస్ట్ ఎస్టేట్ ప్రానింగ్ సెషన్ విజయవంతమైంది. మిల్‌పిటాస్‌లో జరిగిన ఈ సెషన్‌లో ట్రస్ట్స్, ఎస్టేట్ ప్లానింగ్‌పై 20ఏళ్ళ అనుభవం ఉన్న జాసన్ ఎల్ పింటర్ పాల్గొని అందరికీ ఉపయోగపడేలా సమాచారాన్ని తెలియజేశారు. ఈ సెషన్‌కు ఎంతోమంది హాజరయ్యారు. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, తానా మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, జెపి తదితరులు అందించిన సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని తానా వెస్ట్ టీమ్ పేర్కొంది. సతీష్ వేమూరి, రజనీకాంత్ కాకర్ల, భక్త బల్లా, వెంకట్ కోగంటి తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.
Tags :