ఆటా కాన్ఫరెన్స్‌లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
జూలై 2వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు జరిగే ఉమెన్స్ ఫోరం కార్యక్రమంలో పలువురు మహిళా ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఏషియానా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీ అయ్యప్ప, ఏషియానా బోర్డ్ మెంబర్ జయ నెల్లియట్, సైకియాట్రిస్ట్ డాక్టర్ శోభా పలువాయ్, సైకియాట్రిస్ట్ డాక్టర్ జమున రాజు పాల్గొని మాట్లాడనున్నారు. పద్మ పుట్రేవు ప్యానల్ మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు.
జూలై 3 ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు జరిగే కార్యక్రమంలో ఎంట్రప్రె న్యూరర్, ఫిలాంత్రపిస్ట్ ఉపాసన కామినేని, ఎంట్రప్రెన్యూర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేటర్ శ్రీవిద్యారెడ్డి, లీడర్ షిప్ కోచ్ ప్రశాంతి ముత్యాల, సైబర్ సెక్యూరిటీ లీడర్ అపర్ణ కడారి, ఎంట్రప్రెన్యూరర్ సునీత అలుగుబెల్లి, ఫైనాన్షియల్ స్పెషలిస్ట్ ప్రీతి మునగపాటి పాల్గొని మాట్లాడనున్నారు.
ఉమెన్స్ ఫోరం కమిటీకి అపర్ణ కడారి చైర్‌గా, రజని పాడూరు కో చైర్‌గా, పద్మ పుత్రేవు ఎగ్జిక్యూషన్ పిఎం, దీపిక బూజాల, ప్రశాంతి ముత్యాల అడ్వయిజర్‌గా ఉన్నారు.