ASBL Koncept Ambience

నాట్స్‌లో ఉమెన్స్‌ కార్యక్రమాలకు పెద్దపీట

నాట్స్‌లో ఉమెన్స్‌ కార్యక్రమాలకు పెద్దపీట

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో మహిళలకోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మహిళలకు మానసికోల్లాసం కలిగించేలా కార్యక్రమాలు, వనితల విఙాన వికాసానికి, అతివలు ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్న ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలను నాట్స్‌ ఉమెన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సెమినార్‌లలో పలువురు నిష్ణాతులు పాల్గొని ప్రసంగించనున్నారు. ఇంటరాక్టివ్‌ సెషన్స్‌, గేమ్స్‌, ప్రైజ్‌లు, హెల్తీ వంటకాలు వంటివి మహిళలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 

రాజేశ్వరి ఉదయగిరి (ఎంట్రప్రెన్యూర్‌, ఆర్టిస్ట్‌), జాబిలి కందుల (అసోసియేట్‌ ఎడిటర్‌ ఆఫ్‌ ఏవియేషన్‌, ప్రైవేట్‌ పైలట్‌), డా. హేమ జొన్నలగడ్డ (ఎండి, ఎఫ్‌ఎసిఓజి), దుర్గా ప్రశాంతి (ఉమెన్స్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ అంబాసిడర్‌ అండ్‌ మెంటర్‌) తదితరులు ఈ సెమినార్‌లో ప్రసంగించనున్నారు. 

 

 

Tags :