ASBL Koncept Ambience

నాట్స్‌ సంబరాల్లో ప్రత్యేకం... విశిష్ట మహిళావధానం

నాట్స్‌ సంబరాల్లో ప్రత్యేకం... విశిష్ట మహిళావధానం

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో విశిష్ట మహిళావధానం ఒకటి. అమెరికాలో మొట్టమొదటిసారిగా మహిళచే అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రథమ మహిళా శతావధాని, ఏకైక మహిళా ద్విశతావధాని అవధాన సరస్వతి శ్రీమతి ఆకెళ్ల బాలభానుతో అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శతావధాని శ్యమంతకమణిగా కూడా పేరు పొందిన శ్రీమతి ఆకెళ్ళ బాలభానుతో పాటు ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వసుంధర కలశపూడి (దత్తపది), డాక్టర్‌ అపర్ణ యేలూరిపాటి (పురాణపఠనం), డాక్టర్‌ వైదేహి శశిధర్‌ (సంచాలకులు, నృస్తాక్షరి), శ్రీమతి రాధ కాశీనాధుని (అప్రస్తుత ప్రసంగం), శ్రీమతి రాజేశ్వరి బుర్రా (అశువు), శ్రీమతి శ్యామలాదేవి దశిక (వర్ణన), శ్రీమతి ప్రభ రఘునాధన్‌ (చిత్ర పఠనం), డాక్టర్‌ శారదా పూర్ణ శొంఠి (అధ్యక్షులు, నిషిద్దాక్షరి), డాక్టర్‌ జననీ కృష్ణ (సమస్య)లు కూడా పాలొంటున్నారు. 

 

 

Tags :