ముంబై లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు
ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ముంబై లో మహారాష్ట్ర గవర్నర్, ముంబై విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్‌రావుతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ముంబైలో సమావేశమయ్యారు. ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగుభాషా పీఠం ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై విద్యాసాగర్‌రావు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలను పంపితే తగినవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుంచి వలసవచ్చినవారు ఎక్కువగా ఉన్నందున వారికోసం మహాసభల సందర్భంగా ప్రత్యేకంగా రైలును ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించాలని కోరారు. మహాసభల కార్యాచరణ ప్రణాళికలను నందిని సిధారెడ్డి వివరించారు.
Tags :