యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు
యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అదే రోజు మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సాయంత్రం శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహింంచనున్నారు. 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ చేయనున్నారు. స్వస్తిపుణ్యాహవచన మంత్ర పఠనాలతో ప్రధానాలయ ఉద్ఘాటన జరగనుంది.
ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలయంలో పంచకుండాత్మక హోమం చేపట్టనున్నారు. బాలాలయంలో ఉద్ఘాటన పూజల నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు, జరిపించుకోవాలని ఆలయ అర్చకులు సూచించారు.
Tags :