ASBL Koncept Ambience

ఆటా-టాటా వేడుకల్లో యార్లగడ్డకు జీవన సాఫల్య పురస్కారం

ఆటా-టాటా వేడుకల్లో యార్లగడ్డకు జీవన సాఫల్య పురస్కారం

ప్రవాస భారతీయ సంఘాలు అమెరికా రాజకీయాలను శాసించేలా ఎదగాలని పార్లమెంట్‌ మాజీ సభ్యుడు,  కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కోరారు. అమెరికన్‌ తెలుగు సంఘం (ఆటా)- తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన అమెరికా తెలుగు మహా సభల ముగింపు కార్యక్రమాల్లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. తెలుగు వారు అమెరికాలో కష్టపడి సంపాదించిన ప్రతి డాలరును అమెరికన్‌ సమాజంలోనే తెలివైన రీతిలో ఖర్చు చేస్తే భవిష్యత్‌లో భారతీయులతో పరిపుష్టమైన శక్తివంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని యార్లగడ్డ అన్నారు. ఎన్టీఆర్‌ తెలుగు భాష అంటే ప్రాణమిచ్చే వారని, వైఎస్సార్‌ ఆ తెలుగుకు ప్రాచీన హోదా కోసం కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆటా-టాటా సంస్థలు సేవ-సంస్కృతి-సభ్యత అనే నినాదంతో వేడుకలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయ సంఘాల గొప్పదనాన్ని చాటుతున్నాయని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు డాక్టర్‌ అసిరెడ్డి కరుణాకర్‌, టాటా అధ్యక్షుడు డాక్టర్‌ హరనాథ్‌ పొలిచెర్ల, ఆటా వ్యవస్థాపకుడు హన్మంతరెడ్డి, టాటా వ్యవస్థాపకుడు డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి, ఆటా మాజీ అధ్యక్షురాలు గవ్వా సంధారెడ్డి తదితరులు ఆయనను జాప్ఞికతో సత్కరించారు.

 

Tags :