యశోద హాస్పిటల్
హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆసుపత్రిగా యశోద హాస్పిటల్స్‌ను పేర్కొనవచ్చు. అత్యున్నత ప్రమాణాలతో ఇక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్యసేవలను అందిస్తున్నారు. సోమాజిగూడ, మలక్‌పేట, సికిందరాబాద్‌లో యశోద హాస్పిటల్స్ విస్తరించి ఉన్నది. 1,100 పడకలు, 600 మంది డాక్టర్లు, 500 మంది పారామెడికల్ సిబ్బంది, 1,100 మంది నర్సులతోపాటు దాదాపు పది అంబులెన్స్‌లను యశోద హాస్పిటల్స్ కలిగి ఉంది. ప్రతిరోజు వెయ్యిమందికి వైద్య చికిత్సను అందిస్తూ ప్రతి ఏటా లక్షలాదిమందికి వైద్యసేవలను ఈ హాస్పిటల్స్ చేస్తున్నాయి. 50 స్పెషాలిటీ శాఖలు ఉన్నాయి. కార్డియాక్ కేర్‌లో డిజిటల్ ప్లాట్ ప్యానెల్ కాథ్ ల్యాబ్‌ను ఈ ఆసుపత్రి కలిగి ఉంది.
ప్రపంచంలోనే అత్యున్నతమైన క్యాథటరైజేషన్ లాబొరేటరీలలో యశోద ఆసుపత్రిలో ల్యాబ్ కూడా ఒకటికావడం విశేషం. యశోద గ్రూపు హాస్పిటల్స్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. సురేందర్ రావు సోమాజిగూడలో 1989లో చిన్నగా ప్రారంభించారు. 2003లో సికిందరాబాద్‌లో మరో యశోద హాస్పిటల్‌ను నెలకొల్పారు. ఇప్పుడు వెయ్యి పడకలకుపైగా వందలాది డాక్టర్లతో 60 స్పెషాలిటీస్‌తో ఆసుపత్రి ఎదిగింది.ఆసుపత్రి ప్రారంభంలో ప్రతి బ్రాంచ్‌లోనూ అత్యాధునికమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఫ్లాట్ ప్యానెల్ క్యాథ్‌ల్యాబ్, హెపా ఫిల్టర్డ్ ఆపరేషన్ థియేటర్లు, ఐఎంఆర్‌టి, ఎలక్ట్రానిక్ పోర్టల్ ఇమేజింగ్‌తో క్యాన్సర్ ట్రీట్‌మెంట్, బ్రైన్ ల్యాబ్, సిటి వంటి అత్యాధునికమైన పరికరాలతో యశోద గ్రూపు మంచి పేరును తెచ్చుకున్నాయి.
www.yashodahospitals.com |
|
Yashoda Hospital, SecunderabadAlexander Road, Secunderabad - 500003+91 40 - 4567 4567 +91 40 - 2770 3999 secunderabad@yashoda.in
|
Yashoda Hospital, SomajigudaRajbhavan Road, Somajiguda,
|
Yashoda Hospital, Malakpet Nalgonda X Roads, Malakpet, |