తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్
తెలంగాణ కాంగ్రెస్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజాల సురేందర్ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సురేందర్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని లేఖ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారనేందుకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం తన బాధ్యతని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు దూరమైనంది విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రజలు, తన అభిమానులు, కార్యకర్తలంతా టీఆర్‌ఎస్‌తో కలిసి నడవాలని కోరారు.
Tags :