ASBL Koncept Ambience

ఆటా యూత్ ఫోరం కార్యక్రమాలు

ఆటా యూత్ ఫోరం కార్యక్రమాలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌ డీసి కాన్ఫరెన్స్‌లో భాగంగా యూత్‌కోసం ప్రత్యక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. జూలై 1న సాయంత్రం 6 నుంచి 9 వరకు యూత్‌ క్రూయిజ్‌లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సంగీతం, డ్యాన్స్‌లు, ఫుడ్‌, డ్రిరక్స్‌ వంటివి ఏర్పాటు చేసింది. జూలై 2వ తేదీన యూత్‌ ఫోరం కార్యక్రమాల్లో భాగంగా యూత్‌ కమిటీ ప్యానెల్స్‌, వర్క్‌షాప్స్‌, మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ సెలబ్రిటీ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు యోగా ఫర్‌ యూత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జూలై 3వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు హార్ట్‌ఫుల్‌ నెస్‌ మెడిటేషన్‌ ఫర్‌ యూత్‌ కార్యక్రమం జరుగుతుంది.

వివాహ పరిచయ వేదిక

ఆటా మహాసభల్లో తెలుగు యువతీ యువకులకోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకుంటే వారిని ఈ మేట్రిమోనియల్‌ వేదికపై తీసుకెళ్ళి వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకునేందుకు అవకాశాన్ని కలగజేయను న్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించు కోవాలని నిర్వాహకులు కోరుకున్నారు.

 

Tags :