చింతలపూడి బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
– సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలందరి కష్టాలు చూశాను. సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి బాధలు చూశాను.
– మహానేత ఉండి ఉంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూరై్త ఉండేదని రైతులు చెబుతున్నారు.
– 5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన చంద్రబాబు, దాన్ని ఎలా అడ్డుకోవాలనే కుట్ర చేశారు.
– ఇక్కడ పామాయిల్ సాగు ఎక్కువ. కానీ ధర లేదు. పొరుగున ఉన్న తెలంగాణ కంటే ఇక్కడి ధర రూ.1000 తక్కువ.
– చింతలపూడిలో 100 పడకల ఆస్పత్రి కోసం స్థానికులంతా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
– ఇక్కడ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, నామవరం వరకు బస్సులు కూడా పోవడం లేదని, రోడ్డు వేయాలని 5 ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
– ఎన్నికలు రావడంతో చంద్రబాబు ఇక్కడకు వచ్చి కొబ్బరికాయ కొట్టాడు. కానీ నిధులు ఇవ్వలేదు.
– నాయకపోడు కులం వారు ఎస్సీలు అయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు.
– 5 ఏళ్ల చంద్రబాబు పాలనంతా కుట్రలు, కుతంత్రాలు.
– పేదలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు.. చివరకు అవ్వాతాతలను మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే.
– పరిపాలనకు 60 నెలలు ఉంటుంది. ఈ సమయంలో 57 నెలలు కడుపు మాడుస్తున్న చంద్రబాబు, చివరి మూడు నెలల్లో బిరియాని పెడుతున్నాడు.
– ఎన్నికలు వచ్చాయి కాబట్టి కుట్రలు మరింత తీవ్రమవుతాయి. అబద్దాలు, మోసాలు ఎక్కువవుతాయి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెబుతారు.
– ఇవాళ మన యుద్ధం కేవలం చంద్రబాబుతోనే కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, ఆయనకు అమ్ముడుపోయిన మీడియాతో చేస్తున్నాం.
– ఇది ధర్మం, అధర్మం మధ్య సాగుతున్న యుద్ధం.
– అధికారం చేపడితే 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. ప్రతి నిరుపేదకు ఇల్లు ఇస్తాం.
– నవరత్నాలు పథకాలు అందరికీ మేలు చేస్తాయి. వాటిని ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేరేలా ప్రచారం చేయాలి.
– ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయత రావాలి.