ASBL Koncept Ambience

నందిగామ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌

నందిగామ బహిరంగ సభలో  వైయస్‌ జగన్‌

– నందిగామ వర్షాభావ ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా సుబాబుల్‌ పండిస్తున్నారు. «అయినా ధరలు గిట్టుబాటు కావడం లేదు.
– నాడు మహానేత రాజశేఖర్‌రెడ్డి గారి పాలనలో టన్ను సుబాబుల్‌కు రూ.4400 వచ్చేది. ఇవాళ కనీసం రూ.2500 అయినా వస్తోందా? 
– నందిగామ నియోజకవర్గంలో అగ్రి గోల్డ్‌ బాధితులు ఎక్కువ. వారికి ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క రూపాయి అయినా వచ్చిందా?
– అగ్రి గోల్డ్‌ సంస్థ ఆస్తులను చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన మంత్రులు, బినామీలు యథేచ్ఛగా దోచేస్తున్నారు.
– పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే.. ఈసారి ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. ఇప్పటికే 6 వేల స్కూళ్లు మూతబడ్డాయి.
– అంతటా నారాయణ స్కూళ్లు, కాలేజీలే కనిపిస్తాయి. ఇప్పటికే ఎల్‌కేజీ ఫీజులు వాటిలో రూ.25 వేలు ఉంటే అవి, లక్ష రూపాయలకు చేరుతాయి.
– అదే విధంగా ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజు రూ.5 లక్షలు దాటుతాయి.
– ఆర్టీసి, కరెంటు అన్నీ ప్రైవేటుపరం చేస్తాడు. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో అన్నీ బాదుడే బాదుడు.
– పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే, పెన్షన్లు తీసేస్తాడు. రేషన్‌ కార్డులు కోసేస్తాడు.
– 2014కు ముందు రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్‌ కార్డులుంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని 36 లక్షలకు తగ్గించాడు.
– మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు, ఇళ్లు ఎక్కడ పడితే అక్కడ లాక్కుంటాడు. ఇప్పటికే ఆయన భూసేకరణ చట్టం సవరించాడు.
– వెబ్‌ల్యాండ్‌ పేరిట భూరికార్డులు తారుమారు చేస్తున్నారు. మాయం చేస్తున్నారు.
– మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు, ఇళ్లు ఏవీ ఉండవు. ఇప్పటికే ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులు, పొలాలు ఏదీ వదిలిపెట్టడం లేదు.
– ఇప్పటికే ఇసుక లారీ రూ.40 వేలు ఉండగా, అది ఏకంగా లక్ష రూపాయలకు చేరుతుంది.
– ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలు మాఫియాలా మారాయి. అవి ప్రతి పనికి లంచం తీసుకుంటున్నాయి. 
– మళ్లీ పొరపాటున ఓటేస్తే, మీరు ఏ సినిమా చూడాలి, ఏ ఛానల్‌ చూడాలి, ఏ పత్రిక చదవాలి, వాళ్ల స్కూల్‌లోనే చదవాలి, వాళ్ల ఆస్పత్రికే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
– ఇక ఉచిత విద్యుత్‌ ఉండదు. ఇప్పటికే కొనఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులు కనిపించవు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా ఇళ్ల పథకం ఉండవు. అన్నీ రద్దవుతాయి.
– పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రుణాలు రావు. రైతులకు కూడా రుణాలందవు. 
– తనను వ్యతిరేకించే వారెవ్వరినీ బతకనివ్వడు. తన పోలీసులనే గ్రామం నుంచి రాజధాని వరకు పెట్టుకుంటాడు కాబట్టి మనుషులను చంపినా కేసులుండవు.
–  సీబీఐని, ఈడీనీ రానివ్వడు. పత్రికలు, టీవీలు అమ్ముడుపోయాయి కాబట్టి, బాబు నేరాలు చేసినా రాసేవారెవ్వరూ ఉండరు.
– ఇప్పుడు చంద్రబాబునాయుడు చూపుతున్న సినిమాలు, చేస్తున్న డ్రామాలు, ఎన్నికల వాగ్ధానాలు, ఆయన టీవీల్లో ఇస్తున్న పకటనలు మీరు నమ్మితే.. నర మాంసం తినే అందమైన రాక్షసిలా ఉంటుంది.
– మరో 14 రోజుల్లో ఎన్నికలు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

 

 

Tags :