ASBL Koncept Ambience

పాలకొల్లు సభలో వైయస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

పాలకొల్లు సభలో వైయస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

– 3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో పాలకొల్లులో కూడా పర్యటించాను. ఆరోజు మీరు చెప్పిన మాటలు, బాధలు అన్నీ గుర్తున్నాయి.
– పక్కనే గోదావరి ఉన్నా రెండో పంటకు నీరందడం లేదు. అంతో ఇంత పండినా గిట్టుబాటు ధర రావడం లేదు.
– జిల్లాలో పామాయిల్, పొగాకు సాగు  రెండూ జిల్లాలో ఎక్కువే. పొగాకుకు ఏటా ధర పడిపోతోంది. వేలం కేంద్రాల వద్ద నేను ధర్నా చేశాను.
– పామాయిల్‌కు ధర పక్కన తెలంగాణ కంటే రూ.1000 తక్కువ.
– జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతి, అక్రమాలను కట్టడి చేస్తే, వారిని అభినందించాల్సింది పోయి, వారినే జుట్టు పడ్చుకుని ఈడ్చారు.
– మహానేత వైయస్సార్‌ హయాంలో మొదలైన డెల్టా కాలువల ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 
– పాలకొల్లు ఆస్పత్రిలో 50 పడకలు ఉంటే, 100 పడకలుగా చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు.
– నియోజకవర్గంలో అభివృద్ధి అంటే, స్మశానాల అభివృద్ధి పేరుతో కమిషన్లు దండుకోవడం.
– సుదీర్ఘ పాదయాత్రలో అందరి బాధలు విన్నాను. కష్టాలు చూశాను. ప్రభుత్వం పట్టించుకోని ప్రతి కుటుంబానికి చెబుతున్నాను. ‘నేను ఉన్నాను’. 
– ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాలన చూశారు. కుట్రలు చేస్తున్నారు. అబద్ధాలు, మోసాలు కొనసాగుతున్నాయి.
– 14 నెలలు పాదయాత్ర చేసి ప్రతి రోజూ నేను మీతో మమేకం అయ్యాను. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు.
– నాకు కలిగిన ప్రతి కష్టం, నష్టంతో చంద్రబాబుతో పాటు, ఆయన ఎల్లో మీడియా ఎంతో ఆనందించింది.
– చివరకు మా చిన్నాన్న హత్యను కూడా పండగ చేసుకున్నారు. రాజకీయాలతో పాటు, మీడియా కూడా దిగజారింది.
– ఇక్కడ చంద్రబాబుగారి పార్టనర్, ఒక యాక్టర్‌. చంద్రబాబు కుట్రలో భాగమై విలువలన్నీ మర్చిపోయి, ఆయన ఏం చెబితే అదే చేస్తున్నారు.
– అయ్యా చంద్రబాబు పార్టనర్, యాక్టర్‌ గారూ.. ముందుగా మీ కుటుంబాలు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను. 
–  ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను.
– ఇదే మీ కుటుంబంలో ఒకరిని బాబు హత్య చేయించి, మీరే ఆ పని చేశారు? అని చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటే మీకు బాధనిపించదా?
– నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి కాపురం చేశారు. 2014లో చంద్రబాబుకు ఓటేయమని ప్రచారం చేశారు.
– ఆ తర్వాత చంద్రబాబు చేసిన ప్రతి అన్యాయం, మోసంలో పాలు పంచుకున్నారు. ఆ అవినీతి, దారుణాల్లో మీకు వాటా లేదా? 
– నాలుగేళ్లు కలిసి ఉంటారు. ఏడాది ముందు విడిపోయినట్లు డ్రామా ఆడతారు. ఇదే పార్టనర్‌ నామినేషన్‌ వేస్తే అక్కడ టీడీపీ జెండాలు కనిపిస్తాయి.
– ఇక ప్రతి ప్రచారంలో చంద్రబాబు 5 ఏళ్ల పాలన ప్రస్తావన ఉండదు. ఎంత సేపూ జగన్‌పైనే విమర్శలు కొనసాగుతాయి.
– ఎన్నికలు రావడంతో ఈ కుట్రలు ఇంకా సాగుతాయి. అసత్య ప్రచారాలు, నిందలు తీవ్రమవుతాయి.
– గ్రామాలకు మూటల డబ్బు పంపడంతో ఆ కుట్రలు క్లైమాక్స్‌కు చేరుతాయి.

 

Tags :