సంతనూతలపాడు బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగం
– సంతనూతలపాడు నియోజకవర్గంలో సాగు, తాగు నీరు రెండింటికీ ఇబ్బందే. అందుకే ఆ దివంగత మహానేత వైయస్సార్ ఆనాడు గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టులు చేపట్టారు.
– ఇప్పుడు వాటి పరిస్థితి దారుణంగా ఉంది. రామతీర్ధంకు సాగర్ నీరు కూడా ఇప్పించుకోలేకపోయారు.
– గుండ్లకమ్మ మహానేత వైయస్సార్ హయాంలోనే పూరై్తంది. కానీ ఆ ప్రాజెక్టు కింద పంట కాలువలను ఈ 5 ఏళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేదు.
– 11 గ్రామాలలో ఇంకా పునావాసాస పనులు జరగలేదు. దీన్ని బట్టి జిల్లాపై చంద్రబాబు అశ్రధ్ధ కనిపిస్తుంది.
– ఇక్కడ పొగాకు రైతులు ఎక్కువ. వారి పరిస్థితి కూడా దారుణం. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కనీసం వారికి పెట్టుబడి కూడా రాలేదు.
– కంది కనీస మద్దతు ధర రూ.5675 కాగా, రైతులకు రూ.4000 కూడా దక్కడం లేదు. సుబాబుల్‌కు నాడు మహానేత హయాంలో రూ.4400 ధర రాగా, ఇప్పుడు రూ.2400 కూడా రావడం లేదు.
– శనగల కనీస మద్దతు ధర రూ.4620 కాగా, రైతులకు ఇప్పుడు రూ.3500 కూడా రావడం లేదు. అయినా వారి బాధలు వినే నాధుడే లేడు.
– జిల్లాలో దాదాపు 1100 యూనిట్లు, చీమకుర్తిలో దాదాపు 500 యూనిట్లు ఉంటే. జిల్లా వ్యాçప్తంగా ఇప్పటికే దాదాపు 500 యూనిట్లు మూతబడ్డాయి.
– చంద్రబాబు హయాంలో గ్రానైట్, పాలిషింగ్ యూనిట్ల విద్యుత్ ఛార్జీలు, రాయల్టీ పెంచడం వల్ల పరిశ్రమలు మూతబడుతున్నాయి.
– ఈ యూనిట్ల కరెంటు ఛార్జీలు గతంలో మహానేత వైయస్సార్ హయాంలో యూనిట్‌కు రూ.3.70 ఉంటే దాన్ని చంద్రబాబు ఏకంగా రూ.8.70 చేశాడు.
– రాయల్టీ గతంలో పెద్దరాయిపై రూ.1980 ఉంటే చంద్రబాబు దాన్ని రూ.5200 చేశారు. చిన్నరాయిపై గతంలో రూ.660 ఉంటే రూ.1755 చేశారు.
– చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు తగ్గాయి. నిరుద్యోగులు రెట్టింపయ్యారు.
– పొదుపు సంఘాలు బలహీనపడ్డాయి.
– మహిళలకు భద్రత. 5 నిమిషాల్లోనే పోలీసులు అని ఎన్నికల ముందు ఊదరగొట్టారు.
– కానీ మహిళా ఎమ్మార్వోను ఒక ఎమ్మెల్యే జుట్టు పట్టుకునీ ఈడ్చుకుపోయాడు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్. అయినా ఏ ఒక్కరికీ శిక్షలు లేవు.
– 10 ఏళ్ల క్రితం కంటే పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి రెండూ తగ్గాయి.
– ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చేది తగ్గిపోయింది. వారి భూములు లాక్కుంటున్నారు.
– ప్రభుత్వ పాఠశాలలు తగ్గాయి. బార్లు పెరుగుతున్నాయి.
– కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. నారాయణ సంస్థల కోసం ఏకంగా 6 వేల స్కూళ్లు మూసివేశారు.
– మద్యం నియంత్రణ అన్నారు. కానీ ఊరూరా బెల్టు షాపులు పెరిగాయి.
– పోలీస్ స్టేషన్లు పెరగలేదు కానీ, గ్రామాలల్లో జన్మభూమి కమిటీల మాఫియా పెరిగింది.
– చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడం పెరిగింది. 108 సర్వీసులు పని చేయడం లేదు.
– మంత్రి యనమలకు పంటటినొప్పి వస్తే సింగపూర్‌కు పంపాడు. కానీ పక్క రాష్ట్రంలో ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయడం లేదు.
– ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, నీటి ఛార్జులు, పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు.
– అమరావతి పేరుతో అమరేశ్వరుడి భూములు కూడా వదల్లేదు. రా«జదానిలో ఏం కట్టారు అంటే 40 గుడులు కూల్చేశారు.
– రూ. 5 వేల కోట్లతో «రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి, రాజధానిలో ఆయన ఏం చేశారు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.
– అలా అక్షరాల లక్షల కోట్ల రూపాయలతో లోకేష్ స్థిరీకరణ నిధి తెచ్చారు.
– 23 మంది ఎమ్మెల్యేలను కొని విర్రవీగాడు. కానీ ఇవాళ 13 జిల్లాల ప్రజలనే చూసి వణుకుతున్నారు.
– అందుకే ఒంటరిగా ప్రచారం చేయడం లేదు. ఢిల్లీ నుంచి నాయకులను రప్పిస్తున్నారు.