సత్తెనపల్లి బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
– నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్ర ఈ నియోజకవర్గం నుంచి కూడా సాగింది. ఆరోజు మీరు చెప్పిన బాధలు విన్నాను. మీ కష్టాలు చూశాను.
– పక్కనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నా నీరు రాక సత్తెనపల్లికి నీరు రాక, ఆరు తడి పంటలు వేయాల్సి వస్తోంది.
– దేశమంతటా జీఎస్టీ ఉంటే, ఇక్కడ, నర్సారావుపేటలో కేఎస్‌టీ (కోడెల సర్వీస్ టాక్స్) ఉందని, ఈ దోపిడికి తాళలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారు.
– కోడెలకు చెందిన సేఫ్ ఫార్మా కంపెనీ. కానీ అక్కడ అన్నీ నాసిరకం ఉత్పత్తులే. అయినా ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేస్తోంది.
– మెడికల్ స్టోర్లపై ఒత్తిడి చేసి మరీ ఆ ఉత్పత్తులు అమ్మిస్తున్నారు. వారు ఒప్పుకోకపోతే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో దాడి చేయిస్తున్నారు.
– స్పీకర్ పోస్టును భ్రష్టు పట్టించిన వ్యక్తి ఇక్కడి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు.
– పొదుపు సంఘాల మహిళల ముఖాల్లో చిరునవ్వు కనిపించిందని చంద్రబాబు అంటున్నారు. నిజమే! వాళ్ల ముఖంలో చిరునవ్వు కనిపించింది.
– కానీ అది చంద్రబాబు పాలన చూసి కాదు. మరో వారంలో ఈ ప్రభుత్వం దిగిపోతుందన్న ఆనందం వారి ముఖాల్లో కనిపించింది.
– ఇదే ఆనందం అందరిలో, అన్ని వర్గాలలో కనిపిస్తోంది.
– అదే మరోవైపు కొందరి ముఖాల్లో భయం కనిపిస్తోంది. రోజు నాలుగు దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో పాటు, చంద్రబాబు ముఖంలో భయం కనిపిస్తోంది.
– చంద్రబాబుకు తిరిగి అధికారం వచ్చేస్తోందని లోక్‌నీతి, సీఎస్డీఎస్ సర్వే అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొదటి పేజీలో ఆ కొండంత అబద్ధాన్ని తానే వండి వార్చి బ్యానర్ ఐటెమ్ చేశారు.
– అలాంటి సర్వే తాము చేయలేదని అదే లోక్‌నీతి, సీఎస్‌డీఎస్ సంస్థ ఛీకొట్టి రాధాకృష్ణ ముఖాన ఉమ్మేశారు. అయినా సిగ్గు లేకుండా తుడిచేసుకుని మళ్లీ రోజూ ఇంకొక అబద్ధం తయారు చేస్తున్నారు ఈ పత్రికలు, ఈ టీవీలు.
– విశాఖపట్నంలో ఒక గర్భిణి స్త్రీ మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు అమానుషంగా హింసించారని ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో బ్యానర్ స్టోరీ వేస్తారు ఈ పెద్దమనుషులు.
– చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పాటు ఇదే విషయాన్ని మైకు పట్టుకుని మాట్లాడతారు. అసలు ఆ ఘటనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమిటి సంబంధం? అని అడుగుతున్నాను.
– వైయస్సార్‌సీపీకి ఏ మాత్రం సంబంధం లేదని స్థానిక పోలీసులు చెప్పినా, వీరిద్దరికి కూడా ఏ మాత్రం సిగ్గు లేకుండా రోజూ ఇవే అబద్ధాలు పేపర్లలో బ్యానర్ వేస్తారు. వాటి మీద చంద్రబాబు మాట్లాడుతారు.
– బంగారం కంటే బొగ్గు అందంగా ఉందని, నెమలి కంటే కాకి అందంగా ఉందని.. ప్రపంచంలోనే అందరి కంటే అందగాడు, పరిపాలనా దక్షుడు ఎవరు అంటే మన చంద్రబాబు అని చెప్పగలుగుతారు ఈ పెద్దమనుషులు.
– ఇదే ఎల్లో మీడియాను, ఇదే చంద్రబాబును ప్రజల తరుపున అడుగుతున్నాను.
– జన్మభూమి కమిటీలతో గ్రామాలను దోచేసిన చంద్రబాబు నాయుడు గారంటే మీకెందుకంత ప్రేమ?
–రైతు రుణాలను మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని, ఈ 5 ఏళ్ల నుంచి మాఫీ చేయకుండా రైతులను మోసం చేసిన చంద్రబాబుపై మీకు ఎందుకంత ప్రేమ?
– పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలు రుణాలు రూ.14,205 మొదటి సంతకంతోనే మాïఫీ చేస్తానని చెప్పి, చేయకపోవడంతో అవి ఇవాళ తడిసి మోపెడై రూ.28 వేల కోట్లకు చేరాయి.
– ఆ విధంగా దారుణ మోసం చేసిన చంద్రబాబుపై మీకు ఎందుకంత ప్రేమ?
– ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పిల్లలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును భుజాన మోస్తున్నారు. ఆయనపై మీకు ఎందుకంత ప్రేమ?
– రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. అన్నీ దోచుకున్నారు. కానీ ఒక్కనాడు కూడా అవినీతి, దోపిడి గురించి రాయలేదు. చంద్రబాబుపై మీకు ఎందుకంత ప్రేమ?
– కానీ ఇలాంటి పేపర్లు, ఛానళ్లు నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే నిజంగా ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఎక్కడైనా ఉంటుందా?.
– జర్నలిజమ్ అంటే చంద్రబాబు ప్రయోజనమా? లేక చంద్రబాబు ద్వారా మీ ప్రయోజనమా? అని అడుగుతున్నా?
– లేక జర్నలిజమ్ అంటే ప్రజల ప్రయోజనమా?
– ఒక్కసారి గుండెలపై చేతులు వేసుకుని ఇలాంటి దౌర్జన్యాలు, మోసపూరిత రాతలు రాయడానికి మీ మనసెలా వచ్చింది అని అడుగుతున్నా?
– జరగని సంఘటనలు, చంద్రబాబు చేయించిన నేరాన్ని కూడా మా మీదకే నెట్టేసి క్రిమినల్ మైండ్‌సెట్‌తో జర్నలిజానికి తూట్లు పొడుస్తూ, కలం పట్టుకున్న మీరు అసలు మనుషులేనా అని అడుగుతున్నాను?
– ఇటువంటి పత్రికలు, ఇటువంటి టీవీలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాయి.
– చంద్రబాబు పాలన గురించి చర్చ జరిగితే, ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రావని తెలిసి, ప్రతి రోజూ ఏదో ఒక పుకారు సృష్టిస్తున్నారు.
– ఆ పుకారు మీద ప్రతి రోజూ చర్చ జరగాలని, దాని ద్వారా ప్రజలను మభ్య పెట్టాలని చెప్పి ఇంత మంది కుళ్లుతో, ఇంత మంది కుతంత్రాలు పన్నుతున్నారు.