తాడిపత్రి బహిరంగ సభలో వైయస్ జగన్
– సుదీర్ఘ పాదయాత్రలో తాడిపత్రి నియోజకవర్గంలో కూడా నడిచాను. ఆరోజు మీరు చెప్పిన బాధలు గుర్తున్నాయి. మీ కష్టాలు చూశాను. ఆవేదన విన్నాను.
– మహానేత వైయస్సార్ రూ.284 కోట్లతో చాగల్లు ప్రాజెక్టు చేపట్టి, దాదాపు 80 శాతం ఆయన పనులు పూర్తి చేశాడు.
– రూ.102 కోట్లతో నాడు చేపట్టిన పెండేకల్లు ప్రాజెక్టు ఇవాళ్టికి కొనసాగుతోంది.
– ఇక్కడ గ్రానైట్ పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. 750 యూనిట్లలో చాలా వరకు మూతబడ్డాయి. దాదాపు 20 వేల మంది వీధిన పడ్డారు.
– నియోజకవర్గంలో దౌర్జన్యాలు. ఒక నియంత పాలనలో మాదిరిగా ఉన్నాయి.
– చంద్రబాబు దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు.
– పెదవడుగూరు మండలంలో కృష్ణపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని దారుణంగా ఆఫీసులోనే 2015లో చంపారు.
– ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి, గత 20 రోజులుగా ఏం జరుగుతుందో మీకు అర్ధమవుతోంది.
– చంద్రబాబు ఏమంటున్నాడో మీరు విన్నారా? చంద్రబాబు పార్టనర్, ఒక సినిమా యాక్టర్.. ఏమంటున్నాడో మీరు వింటున్నారా?
– మన పార్టీ గుర్తుకు పోలిక ఉండే హెలికాప్టర్ గుర్తుతో పాటు, మన పార్టీ కండువాను పోలి ఉండే కండువాతో చంద్రబాబు కొత్త పార్టీలను పెట్టిస్తున్నాడు.
– ఆ విధంగా ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు.
– ఇంకా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో పాటు, చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా ఏమంటున్నదో మీరు వింటున్నారా?
– పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు పడతాయన్నది సామెత. మన గెలుపు ఖాయం అయిది కాబట్టే మనల్ని విమర్శిస్తున్నారు.
– తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్‌కు మద్దతు ఇచ్చారని, రూ.1000 కోట్లు ఇచ్చారని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
– చంద్రబాబు పార్టనర్ కూడా అవే మాట్లాడుతున్నాడు. ఎల్లో మీడియా కూడా సిగ్గు లేకుండా దాన్నే ప్రచారం చేస్తోంది.
– అయ్యా చంద్రబాబు, ఆయన రూ.1000 కోట్లు ఇస్తుండగా నీవేమైనా చూశావా?
– లేక కేసీఆర్ గారు నీకేమైనా ఫోన్ చేసి చెప్పారా? తాను జగన్‌కు రూ.1000 కోట్లు ఇచ్చానని చెప్పారా?
– వయసుకు కూడా గౌరవం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. పచ్చి అబద్ధాలు చెబతున్నావు. అది నీకే చెల్లబాటు అవుతుంది
– కేసీఆర్ మద్దతు ఇస్తోంది మాకా? లేక ప్రత్యేక హోదాకా?
– కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అంత అభ్యంతరం?
– హోదాకు వేరే రాష్ట్రాలు మద్దతు ఇస్తున్నాయి. మరి అలా ఇవ్వొద్దా?
– హరికృష్ణ శవం పక్కనే టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం నీవు కేటీఆర్‌తో మంతనాలు జరపలేదా?
– అంటే మీతో పొత్తు పెట్టుకుంటే మంచివారు. లేకపోతే చెడ్డవారా?
– ఇదే చంద్రబాబు, ఆయన పార్టనర్, యాక్టర్ గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు కేసీఆర్‌ను పొగిడారో గుర్తుకు తెచ్చుకోండి.
– అందితే జుట్టు లేకపోతే కాళ్లు. ఇదీ చంద్రబాబు నైజం.
– ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు.
– ఇవాళ మన వాళ్లు అక్కడ (హైదరాబాద్‌లో) ఉన్నారు అని కనీస జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఆయన పార్టనర్‌తో పాటు, ఎల్లో మీడియా కూడా అదే ప్రచారం చేస్తోంది.
– తెలంగాణ ప్రభుత్వం, టీడీపీ నాయకులను, ఏపీ పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తోంది అంటున్నారు.
– వాళ్లు నిజంగా అలా చేస్తే మరి ఈనాడు రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కూడా బెదిరించారా? హైదరాబాద్‌లోని వాళ్ల ఆస్తులు ఎవరైనా లాక్కున్నారా?
– చంద్రబాబునాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడంటే, రాజకీయ లాభం కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టి, అక్కడ (హైదరాబాద్‌లో) ఉన్న మన వారికి అన్యాయం చేస్తున్నాడు.
– తాను బాగా పాలించాను కాబట్టి ఓటు వేయండి అని చంద్రబాబు అడగలేకపోతున్నారు.
– అందుకే లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుంది. ఇంకేదో జరుగుతుంది. అంటూ రోజుకో కధ తెస్తున్నారు.
– తానే మా చిన్నాన్నను చంపించాడు. తనకు చెందిన పోలీసులతో దర్యాప్తు చేయిస్తాడు. అనుకూల మీడియాలో కధనాలు వక్రీకరిస్తాడు.
– తన పాలన మీద చర్చ జరిగితే డిపాజిట్లు రావని చంద్రబాబుకు తెలుసు. అందుకే భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాడు.
– ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం, చూపని సినిమా ఉండదు.