ASBL Koncept Ambience

పులివెందులలో జగన్ నామినేషన్

పులివెందులలో జగన్ నామినేషన్

కడప జిల్లా పులివెందుల శాసనసభ స్థానానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. సర్వమత ప్రార్థనలు అనంతరం తన తల్లి వైఎస్‌ విజయమ్మ దీవెనలు అందుకుని పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయం చేరుకున్నారు. మధ్యాహ్నం 1:49 గంటలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.సత్యంకు నామినేషన్‌ పత్రాలు అందించారు. మొత్తం రెండు సెట్ట నామినేషన్‌ పత్రాలు అందించారు. ఒకటి వైఎస్‌ జగన్‌, మరొకటి మనోహర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం జగన్‌ హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్లారు.

 

Tags :