చంద్రబాబు పిట్టల దొర : వైఎస్ జగన్
అనంతపురం జిల్లా నల్లమాడలో ప్రజలను ఉద్దేశించి.. వైయస్సార్సీపీ అద్యక్షుడు వైఎస్ జగన్
పిట్ల దొర కథ ఒకటి మీకు చెబుతా. పిట్లల దొర ఎవరంటే..? ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పేవాడు. గుండువారిపల్లి లో నిరుపేద శివన్న రైతు కథ ఇది. ఆయనకు అయిదెకరాల భూమి ఉంది. బ్యాంకు రుణం పొంది. వేరుసెనగ పంట వేశారు రూ 90 వేలతో అనంతపురం జిల్లాలో కరువు ఆవహించింది. శివన్న అల్లాడిపోయారు కరువు చూసి ఈలోగా పిట్టల దొర వచ్చి దేవుడిని నమ్ముకోవద్దు. నన్ను నమ్ముకో అన్నారు. అపుడే బావిలో నీరు వస్తుందని నమ్మబలికాడు. నాకు 9 సంవత్సరాల అనుభవం ఉందని.. చెప్పాడు ఆ పిట్టల దొర. నా దగ్గర రైన్ గన్స్ ఉన్నాయన్నారు పిట్టల దొర. దీంతో అధికారులు గబ గబ శివన్న పొలంలో ఫారం పాండు తవ్వారు. టాంకరుతో నీరు తెచ్చి నింపారు. ఆ నీటి ఆధారంగాఇ పొలంలో రైన్‌గన్స్ పెట్టారు. రైన్‌గన్ష్ ఆన్‌చేశారు. నీరు అలా వచ్చింది... ట్యాంకురు నీరు అయిపోయింది. దీంతో శివన్న సంతోష పడ్డారు. తరువాత అధికారులు టార్పలిన్ చుట్టేశారు.. రైన్ గన్స్ తీసుకెళ్ళిపోయారు. ఇదిగో ఆ ఫోటోలు ....చూడండి. రైన్‌గన్స్ తీసుకెళ్ళిన తరువాత .. గంటకు తెలిసింది నిజమేమిటో శివన్నకు నీరు లేక పొలం ఎండి పోయింది. అయిదెకరాలకు అర బస్తా వచ్చింది. శివన్న పరిస్థితి ఇది.
ఇపుడు బాకీల తీర్చేందుకు వడియాలు అమ్ముతున్నారు శివన్న ఇంతకు పిట్లల దొర ఎవరో తెలుసా? ఆయన పేరు ఎవరప్పా? ఆయన పేరే చంద్రబాబు పిట్టలదొర. శివన్న తాత గత ఎన్నికలలో టీడీపీకి ఓటేశారు. చంద్రబాబు మాటే వద్దంటున్నారు శివన్న ఇపుడు రుణాలు మాఫీ కాలేదంటున్నారు ఆయన రూ 90 వేలు బ్యాంకు రుణం పేరుకొని పోయింది. ఆయన భార్య బెంగుళూరులో హోటల్‌లో పని చేస్తోందట పాపం శివన్న వేరువెనగ పంట ఎండిపోవడంతో భారీగా నష్టపోయాడు.
ఇది పిట్టల దొర కథ.
మీ ఆశీర్వాదంతో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలను ఆదుకుంటా