కియా ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటర్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియో మోటర్స్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కియా మోటర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్ బాటలోనే మరికొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయని మఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పెనుకొండలో కియా ఫ్యాక్టరీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. కియా కార్ల పరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు కావటం శుభపరిణామం. కియా యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు కియా సంస్థ ను అభినందిస్తున్నా అని అన్నారు.
అంతకుముందు పరిశ్రమలోని అన్ని విభాగాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ప్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని జగన్ వీక్షించారు. రూ.13500 కోట్ల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమను ఏర్పాటు చేశారు.