ASBL Koncept Ambience

పార్టీ ఎంపీలతో వైయస్ జగన్ భేటీ ముఖ్యాంశాలు

పార్టీ ఎంపీలతో వైయస్ జగన్ భేటీ ముఖ్యాంశాలు

– ఏప్రిల్‌ 6 కన్నా పార్లమెంటు ముందే నిరవధికంగా వాయిదాపడితే అదే రోజే ఎంపీలు లోక్‌సభకు రాజీనామాలు: వైయస్‌ జగన్‌
– గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లలో ప్రజాసంకల్పయాత్ర శిబిరంలో పార్టీ ఎంపీలతో వైయస్‌ జగన్‌ సమావేశం
– ప్రత్యేక హోదా పోరాటంపై ఎంపీలకు దిశానిర్దేశం, గంటా 45 నిమిషాలసేపు సమావేశం
– రాజీనామాలన్నీ స్పీకర్‌ ఫార్మాట్‌లోనే ఇవ్వాలి : వైయస్‌ జగన్‌
– ముందుగా రాజీనామాలు ప్రకటిస్తే.. టీడీపీకూడా ఈ తరహా ప్రకటనలు అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తంచేసిన ఒకరిద్దరు ఎంపీలు 
– ప్రత్యేక హోదా సాధన పోరాటంలో బేషజాలకు పోవాల్సిన పనిలేదు: ఎంపీలకు వైయస్‌ జగన్‌ ఉద్భోద
– ఏ విషయాన్నైనా దాపరికంలేకుండా మనం ప్రజలముందు ఉంచుతున్నాం: వైయస్‌ జగన్‌

– రాజీనామాల ప్రకటన నుంచి అవిశ్వాసం వరకూ మనం నిర్ణయాలన్నీ చిత్తశుద్ధితో తీసుకున్నాం: వైయస్‌ జగన్‌ 

–వాటిని నేరుగా ప్రజలముందే ఉంచుతున్నాం : వైయస్‌ జగన్‌

–ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి, ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దేశవ్యాప్తంగా చర్చజరగాలన్నదే మన ఉద్దేశం : వైయస్‌ జగన్‌

–మనం రాజీనామాలు ప్రకటించినప్పుడు,  అవిశ్వాసం పెడతానన్నప్పుడు చంద్రబాబు ముందుకురాలేదు : వైయస్‌ జగన్‌

– విధిలేని పరిస్థితుల్లో వారుకూడా అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది: వైయస్‌ జగన్‌ 

– ఏది ఏమైనా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒక నిర్ణయం విషయంలో ముందుకు వస్తే.. దానివల్ల వచ్చే ఒత్తిడి, తీవ్రత వేరేలా ఉంటుంది: వైయస్‌ జగన్‌

– ఎవరు ముందు, ఎవరు వెనక కన్నా.. ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ముఖ్యం : వైయస్‌ జగన్‌

– అందుకే మనం రాజీనామాల నిర్ణయం ప్రకటించినప్పుడు కలిసి రావాలని చంద్రబాబును అడిగాం: వైయస్‌ జగన్‌

– అవిశ్వాసం ముందు వారు పెట్టినా మద్దతు ఇస్తామన్నాం, లేదంటే.. మనం పెట్టినా మద్దతు ఇవ్వాలని కోరాం : వైయస్‌ జగన్‌

మన పోరాట ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది: వైయస్‌ జగన్‌

– ఇప్పుడు కూడా రాజీనామాల విషయంలో కలిసి రావాలని టీడీపీని కోరుతున్నాం: వైయస్‌ జగన్‌

– రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒకేతాటిపైకి వచ్చి రాజీనామాచేస్తే.. దాని తీవ్రత ఎక్కవ ఉంటుంది. కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది: వైయస్‌ జగన్‌

– ఇక్కడ బేషజాలకు, ఎవరు ముందు, ఎవరు వెనుక అనే చర్చలోకి పోవాల్సిన అవసరంలేదు: వైయస్‌ జగన్‌

– అవిశ్వాసంపై గట్టిగా పట్టుబట్టండి : వైఎస్‌ జగన్‌

– అందర్నీ కలుపుకు వెళ్లండి : వైఎస్‌ జగన్‌

– ప్రత్యేక హోదాకోసం వైయస్సార్‌సీపీ పోరాడుతున్న తీరుపై పార్లమెంటులో వివిధ పార్టీల తీరును వైయస్‌ జగన్‌కు వివరించిన ఎంపీలు 

– ఎత్తుగడలు, మీడియా మేనేజ్‌మెంట్లను నమ్ముకుని ఇరుకునపడ్డామన్న అభిప్రాయాన్ని వ్యక్తిగత సంభాషణల్లో టీడీపీ ఎంపీలు వెల్లడించారని వైయస్‌ జగన్‌కు చెప్పిన ఎంపీలు

– ‘‘ప్రత్యేక హోదారోసం మీ నాయకుడు చక్కటి పోరాటాన్ని చేస్తున్నారంటూ...’’ అనేక పార్టీలకు చెందిన నాయకులు ప్రశంసించిన విషయాన్నని వైయస్‌ జగన్‌కు చెప్పిన ఎంపీలు 

– ‘‘మానాయకుడు ఏదైనా ముక్కుసూటిగా చేస్తాడని, దాపరికం లేకుండా వ్యవహరిస్తాడన్న విషయాన్ని’’ ఆయా పార్టీలకు చెప్పామన్న ఎంపీలు 

– పార్లమెంటులో ఏచోటచూసినా ప్రత్యేక హోదాపైనే చర్చ జరగుతుందని వైయస్‌ జగన్‌కు వివరించిన ఎంపీలు

– మన పోరాటానికి పార్టీల నుంచి చక్కటి మద్దతు వస్తుందని వివరించిన ఎంపీలు. 

ఎంపీల సమావేశంలో పాల్గొన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

Click here for Photogallery

 

Tags :