ప్రజాసంకల్పయాత్రకు ఘనమైన ముగింపు
ప్రజాసంకల్ప యాత్రకు ప్రతీకగా స్థూపం
ఇచ్ఛాపురంలో భారీ నిర్మాణం
వైఎస్ జగన్ పాదయాత్ర విశేషాలను వివరించేలా డిజైన్
గ్రానైట్ పలకలపై అద్భుతంగా పాదయాత్ర విశేషాలు
చరిత్రాత్మక ప్రజాసంకల్ప యాత్రకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా ముగింపు చెప్పబోతోంది. పాదయాత్ర సంకల్పాన్ని చాటిచెప్పేలా చిరస్థాయిగా నిలిచిపోయేలా స్థూపాన్ని యుద్ధప్రాతిపదికన పార్టీ పూర్తిచేస్తోంది. పాదయాత్ర స్ఫూర్తిని, ప్రజలకిచ్చిన భరోసాలను గుర్తుకు తెస్తూ ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈనెల 9న పాదయాత్ర ముగింపు సందర్భంగా శరవేగంగా పనులు చేస్తున్నారు. శ్రీకాకుళంనుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న మార్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఎడమవైపున, అటువైపు బరంపురం నుంచి వస్తున్నప్పుడు కుడివైపున, ‘‘బహుదానది’’ తీరాన ఈస్థూపం రూపుదిద్దుకుంటోంది. ఇచ్ఛాపురం టౌన్‌కు 2 కిలోమీటర్ల ముందే ఈ స్థూపం కనిపిస్తుంది. పాదయాత్ర చివరిరోజున వైఎస్ జగన్ ఈ స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. ఇప్పటికే వైయస్సార్‌గారు చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్రకూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. దీనికి గుర్తుగా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు. ఆతర్వాత వైయస్ షర్మిళగారు ‘‘మరో ప్రజాప్రస్థానం’’కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. దీనికి గుర్తుగా మరో స్థూపాన్ని కట్టారు. ఇప్పుడు వైయస్ జగన్‌గారి ప్రజాసంకల్ప యాత్రకూడా ఇచ్ఛాపురంలోనే ముగియనుంది.
మూడు అంతస్తుల లెక్కన, పునాది నుంచి 88 అడుగుల ఎత్తులో స్థూపం ఉంటుంది. పునాది నుంచి స్థూపం బేస్ వరకూ 13 జిల్లాలను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు. నాలుగు పిల్లర్లపై 3 అంతస్తుల్లో స్థూపం ఉంటుంది. మొదటి అంతస్తులో వైయస్‌జగన్‌గారి పాదయాత్ర ఫొటోలు ఉంటాయి. రెండో అంతస్తులో మహానేత వైయస్సార్‌గారి ఫొటోలు ఉంటాయి. చివరి అంతస్తు వృత్తాకార ఆకృతిలో ఉంటుంది.
చివరి అంతస్తు డోమ్ నుంచి 15 అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని పెడుతున్నారు. స్థూపానికి చుట్టూ ఉన్న ప్రహరీగోడపైన పాదయాత్ర విశేషాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని వైయస్సార్‌సీపీ ప్రోగ్రాం కో–ఆ్డనేటర్ తలశిల రఘురాం పేర్కొనారు. స్థూప నిర్మాణంలో గెలాక్సీ గ్రానైట్‌ను వినియోగిస్తున్నారు. ఈగ్రానైట్ పలకలపై పాదయాత్ర ఫొటోలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ముద్రించారు.
ప్రజాసంకల్పయాత్ర అంకెల్లో:
పాదయాత్ర వివరాలు : (జవరి 9 వరకూ)
మొత్తం పాదయాత్ర జరిగిన రోజులు : 341
మొత్తం దూరం : 3,648 కిలోమీటర్లు (కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దూరం)
పాదయాత్ర నియోజకవర్గాలు : 134
పాదయాత్ర సాగిన మొత్తం గ్రామాలు : 2,516
పాదయాత్ర సాగిన మండలాలు: 231
పాదయాత్ర సాగిన మున్సిపాల్టీలు: 54
పాదయాత్ర సాగిన కార్పొరేషన్లు : 8
బహిరంగ సమావేశాలు : 124
ఆత్మీయ సమ్మేళనాలు : 55