ASBL Koncept Ambience

దర్శి నియోజకవర్గం తాళ్లూరులో ప్రజాసంకల్పయాత్ర

దర్శి నియోజకవర్గం తాళ్లూరులో ప్రజాసంకల్పయాత్ర

అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ వైయస్ జగన్. 

శ్రీ వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

- కంది పండించాం. వర్షాలు సరిగ్గా పడటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనతో పాటు కరువు వచ్చిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

- కనీసం సాగర్ నీరు వస్తాయేమో అని ఎదురు చూశాం. సాగర్ కుడికాల్వకు 140 టీఎంసీల కేటాయింపు ఉన్నా.. అవీ రాలేదు. 

- బాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వరి పంట ఏనాడూ వేసుకోలేదు. తెలంగాణలో ఎడమ కాల్వ వెళ్తోంది. అక్కడ రైతులు వరి వేసుకుంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రికి ఉన్నదేమిటి? మన ముఖ్యమంత్రికి లేనిది ఏమిటో అర్థం కావటం లేదంటున్నారు. అన్ని అవస్థలు పడి చివరకు కంది వేసుకున్నాం. 

కనీస మద్దతు ధర రూ.5450. గిట్టుబాటు ధరలు ఏ పంటకూ రాని పరిస్థితి ఉంది. కందిని మార్కెట్ లో అమ్మాలన్నా రూ.4వేలకు తీసుకునే నాథుడు లేదని రైతన్నలు అల్లాడుతున్నారు. చంద్రబాబు కంది కొంటామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మార్కెట్ యార్డులో వాళ్లు కేవలం రెండు బస్తాలు మాత్రమే కొంటారని రైతన్నలు వాపోతున్నారు. 

- రైతు పండించిన పంటలో 10శాతం మాత్రమే కొంటారట. అదీనూ రెండు బస్తాలు మాత్రమే కొంటారట. పాస్ బుక్ తీసుకువెళ్లాలట. అందులో శెనగ వేసి ఉంటే కొనరట. కంది మాత్రమే అని ఉంటే కొంటారట. 

- జామాయిల్, సుబాబుల్ వేసుకునే రైతన్నలు కూడా తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్నగారి హయాంలో మొదట్లో సుబాబుల్ రూ.1600 ఉంటే దాన్ని నాన్నగారు పట్టించుకొని రూ.4400 వరకు తీసుకువెళ్లారన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో మళ్లీ మొదటికి వచ్చింది. ఈ రోజున జామాయిల్ పంటలు వేస్తే రూ.1800లకు, సుబాబుల్ పంటకు రూ.2000లు ఇచ్చే నాధుడు లేడని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.

- చంద్రబాబు వచ్చిన ఈ నాలుగేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్.

- నాగార్జున సాగర్, వెలుగొండ ప్రాజెక్ట్ మనకు ముఖ్యమైనవి. 43 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి మన ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తీసుకు రావొచ్చు. చంద్రబాబు రాకముందే డీపీఆర్ తయారైంది. చంద్రబాబు ఆ డీపీఆర్ చూసి చెత్తబుట్టలో పెట్టారు. నాన్నగారు ఆ ప్రాజెక్టును ప్రకాశం జిల్లాకు తేవాలని.. అది పూర్తైతేనే జిల్లా బాగుపడుతుందని భావించారు. ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారని వీరందరికీ న్యాయం జరగాలంటే కచ్చితంగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకురావాలని ఎవ్వరూ ఊహించని విధంగా సొరంగాలు తవ్వి నీళ్లు తవ్వే పని ప్రారంభించారు. నాన్నగారి హయాంలో 18కి.మీ. మొదటి సొరంగంలో 13 కి.మీ నాన్నగారి హయాంలో పూరైంది. 18 కి.మీ. రెండో సొరంగంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 9 కి.మీ పూర్తి చేశారు. దివంగత ప్రియతమ నాయకుడు వైయస్ఆర్ యుద్ధప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టు నడిపించారు. వెలుగొండ మీద, ప్రకాశం జిల్లా మీద చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్కటి నిదర్శనం చాలన్నారు. 

- దొనకొండలో 50వేల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. రాజధాని ఇక్కడ పెడితే బావుంటుందని కేంద్ర కమిటీ సిఫార్సు చేస్తే దాన్ని ఈ పెద్ద మనిషి చెత్తబుట్టలో పడేశారు. దొనకొండను బాగు చేస్తాను. ఇండస్ట్రియల్ హబ్ తీసుకువస్తానని పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు చెప్పారు. కనీసం ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా అని శ్రీ వైయస్ జగన్ నిలదీశారు. 

- విశాఖలో పార్టనర్ షిప్ మీటింగ్ లు పెట్టి.. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి. 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయ్ అంటున్నారు. మీకు ఎక్కడైనా ఆ ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు కనిపించాయా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. 

- చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలే. ఇవే చంద్రబాబుకు పునాదులు. 

- మండ్లగూరు మండలంలో మూసీ వాగుపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తానని ముఖ్యమంత్రి అయ్యాక బాబు చెప్పారు. మరి, జరిగిందా?

- తాళ్లూరు మండలంలో మొగిరిగుండ్ల రిజర్వాయర్ నిర్మించి 15 గ్రామాలకు నీళ్లు అందిస్తామన్నారు. ఎక్కడైనా కనిపించిందా?

- ఈ జిల్లాలో కాస్తో, కూస్తో ఉద్యోగాలు వచ్చి.. చదువుకున్న యువకులకు ఉపాధికల్పించాలంటే.. రెండు పోర్టులు ఉన్నాయి. రామాయపట్నం, వాన్ పిక్ పోర్టు పూర్తైతే.. ఇక్కడ యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేవి. 

- ఈ పెద్ద మనిషి చంద్రబాబు పట్టించుకొని యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని అనుకోవటం లేదు. చదువుకున్న యువత హైదరాబాద్, బెంగలూరు వెళ్లాల్సి వస్తోందన్న ఇంగితం లేదు. ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయన్న సంగతి చంద్రబాబుకు తెల్సు. పరిశ్రమ పెట్టడానికి 3-4 ఏళ్లు పెడుతుంది. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని చంద్రబాబు తిరుపతిలో అడిగారు. రాజ్యసభలో వెంకయ్య మాట్లాడుతూ.. పరిశ్రమలు పెట్టడానికే 3 ఏళ్లు పడుతుంది. మీరు (కాంగ్రెస్) 5 ఏళ్లే పడుతుందన్నారు. 10 ఏళ్లు హోదా కావాలన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ప్రత్యేకమైన పారిశ్రామిక రాయితీలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే ఇస్తారు. ఇన్ కంట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు, కరెంటు చార్జీల్లో రిబేటు వస్తాయి. అప్పుడే హాస్పటల్స్, హాటళ్లు, పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు ప్రతిజిల్లా హైదరాబాద్ అయ్యేది. చంద్రబాబుకు తెల్సినా కూడా.. ప్రత్యేక హోదాను నీరుగార్చారు. 

- ప్రత్యేక హోదాతో ఉద్యోగాలు వస్తాయన్న చంద్రబాబు ప్లేటు మార్చారు. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే.. అత్త వద్దంటుందా.. ప్యాకేజీ కావాలన్నారు. 

ప్యాకేజీతో మోసం చేస్తున్నారు. హోదా అనే మన హక్కును నీరు గారుస్తున్నారు. వాళ్లు ఏ ప్యాకేజీ ఇవ్వకపోయినా ఇచ్చినట్లు పిక్చర్ ఇస్తున్నారు. 

- పోలవరం ప్రాజెక్టును విభజన చట్టం ప్రకారం కేంద్రమే  కట్టాలి. కేంద్రంతో నువ్వు కట్టొద్దు. మేమే ప్రాజెక్టు కడతాం. ప్రాజెక్టులో రేట్లు పెంచుకుంటాం. నా బినామీలు సబ్ కాంట్రాక్టర్లుగా తెచ్చుకుంటాం అంటున్నారు. 

- పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు రేట్లు విపరీతంగా పెంచేశారు. సిమెంటు, ఇసుక, స్టీల్ రేట్లు తగ్గాయి. అయినా రేట్లు పెంచుతున్నారు. సబ్ కాంట్రాక్టర్లుగా తన బినామీలు వస్తారు. యనమల రామక్రిష్ణుడు వియ్యంకుడు కాంట్రాక్టరుగా వస్తారు. 

- ప్రజల్లో ప్రత్యేకహోదా మీద వేడి పుడుతుందో చంద్రబాబులో కదలిక వస్తుంది. ఈ మధ్యే ఫ్లేటు మార్చారు. నిన్న వాళ్ల పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని.. ప్రత్యేక హోదా వద్దనలేదని, దశల వారీగా పోరాటం చేస్తాం.. మంత్రిపదవుల రాజీనామా ఆఖరి అస్త్రమని చంద్రబాబు అన్నాడట. 

- ఊసరవెల్లికి ఎన్ని రంగులు ఉంటాయో తెలీదు కానీ చంద్రబాబు పూటకో రంగు మారుస్తున్నారని అర్థమౌతోందన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కదులుతోంది. ప్రత్యేక హోదా యుద్దం తుదిఘట్టానికి చేరుకుంది. 

- మార్చి 1న కలెక్టరేట్లు దిగ్భందం చేశాం. ఈ రోజు ఝ(మార్చి3న) ఢిల్లీ ప్రయాణం అయ్యేందుకు నిన్న విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు బయలుదేరటానికి జెండా ఊపాను. 

- చంద్రబాబు పార్టనర్ చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టండని పిలుపు ఇచ్చారు. ఆయన నోట్లో ఉన్నప్పుడు మాట వస్తే.. వేలు ఎత్తి మనవైపు చూపించే పరిస్థితి రాకూడదని.. విశ్వసనీయతకు అర్థం చెప్పేలా.. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు మద్దతు ఇచ్చేలా రమ్మన్నారు. 

- చంద్రబాబు కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలి. మార్చి 21న బాబు పార్టనర్ చెప్పిన సలహాతో అవిశ్వాసం పెట్టడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి.. మిగతా ఎంపీలంతా..మద్దతు ఇవ్వాలి. ఆ తర్వాత అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్ 6వ తారీఖున 25 మంది ఎంపీలంతా రాజీనామా చేయటం. ఇది చివరి అస్త్రం. ఈ మాదిరిగా చేస్తే కేంద్రమైనా దిగి వస్తుంది. ఏపీ అంతా ఒక్కతాటిగా ఉందని హోదా ఇస్తారు. ఈ రోజు పూర్తిగా చిత్తశుద్ధి లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ముఖ్యమంత్రి మనకున్నాడు కాబట్టి.. పైకి ఒకమాట చేతల్లో మరొకటి చేస్తున్నారు. 

- ఇటువంటి పెద్దమనిషిని చూస్తే కథ గుర్తుకు వస్తుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే బౌలర్, బ్యాట్స్ మెన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాడు. ఏదైనా ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే ఒక మ్యాచ్ కో, రెండు మ్యాచ్ లకో నష్టం వస్తుంది. ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం అవుతుంది. కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే ప్లేయర్లు అందర్నీ రంగంలోకి దింపేస్తారు. చంద్రబాబు ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. ఒక కెప్టెన్ అమ్ముడుపోతే.. జట్టు ఓడిపోతుంది. ముఖ్యమంత్రి అమ్ముడుపోతే రాష్ట్రం మొత్తం అన్యాయమౌతుందని చంద్రబాబు చూపిస్తున్నారు. చంద్రబాబు ఏఏ మోసాలు చేశారో మీ అందరికీ తెల్సు. 

- పొరపాటున చంద్రబాబును క్షమిస్తే .. మీదగ్గరకు వచ్చి చిన్నచిన్న అబద్ధాలకు లొంగరని తెల్సు. పెద్ద పెద్ద అబద్ధాలు, పెద్దపెద్ద మోసాలు చేస్తారు. 

- ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్మరని మూడు వేలు ఇస్తారు. మూడు వేలు కాదు.. ఐదువేలు గుంజండి. అబద్ధాలు, మోసాలు చేసేవారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలన్నారు. 

- చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నవరత్నాలు అమలు చేస్తాం. 

-పిల్లల చదువులకు ఎంత ఖర్చైనా భరిస్తాం. అంతేకాకుండా చిన్నపిల్లలకు బడులకు పంపే తల్లులకు ఏటా 15వేలు ఇస్తాం. 

- పెద్ద చదువులు చదివేవారికి హాస్టల్ మెస్ ఛార్జీలు చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు.

 

Tags :