తాళ్లూరులో వైయస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైయస్ జగన్
ప్రకాశం జిల్లా హోదా కోసం ఢిల్లీలో వైయస్ఆర్ సీపీ పోరు. ప్రకాశం జిల్లా తాళ్లూరు చేరుకున్న వైయస్ఆర్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..వారితో వైయస్ జగన్ సమావేశం అయ్యారు.
YSRC President YS Jagan Mohan Reddy's 3,000Km Praja Sankalpa Yatra has reached Darsi AC.
Priests from various religions welcomed Jagan at Shivarampuram village and offered Special prayers.
Expressing solidarity to his yatra many people from different walks of life took part in the event. Holding flags, Garlands, Harathis and placards, the party leaders and the public took out rallies in the area.
హోదా డిమాండు చేస్తూ మార్చి 5న ఢిల్లీలో వైయస్సార్‌సీపీ ధర్నా
వైయస్సార్సీపీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ప్రకాశం జిల్లా తాళ్లూరు ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో మార్చి 5 న వైయస్సార్‌సీపీ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లా తాళ్లూరులో ప్రకటించారు. మొదట పార్టీ అద్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తో సమావేశం అయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కొందరు పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారని, మిగిలిన వారంతా ఈరోజు బయలు దేరుతారని చెప్పారు. విభజన చట్టంలోని ఆదేశాలను అమలు పర్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని, 11 రాష్ట్రాలకు హోదా కల్పించి ఏపీకి హోదా ఇవ్వడం లేదని వాపోయారు. కేంద్రానికి కనువిప్పు కలిగించేలా వైయస్సార్‌సీపీ ఆందోళన చేస్తోందని గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా గురించి మాట మారుస్తున్నారని, ఒక రోజు హోదా వల్ల ప్రయోజన ఏమిటని మరో రోజు హోదా కావాలని, అంటున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. హోదా డిమాండు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా లోక్‌సభలో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ తీర్మానానికి ఇతర పార్టీల వారు ఏమేరకు మద్దతు ఇస్తారో చూడాలని పేర్కొన్నారు. హోదాపై 184 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై కూడా లోక్‌సభలో చర్చ జరుగుతుందని మేకపాటి అన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైయస్సార్‌సీపీ ఎంఎల్ ఏలు హాజరు కారు
చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మేకపాటి విమర్శించారు. వైయస్సార్‌సీపీకి చెందిన 23 మంది వైయస్సార్‌సీపీ ఎంఎల్ ఏలను, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారని ప్రస్తావించారు. కొందరు ఎంఎల్ ఏలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ ఏలు తమ పదవులకు రాజీనామా చేయాలని, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైయస్సార్‌సీపీ డిమాండు చేస్తోందని తెలిపారు. అంత దాకా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎంఎల్ ఏలు హాజరు కారని స్పష్టం చేశారు. వైయస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు ఎంఎల్ సీలు కూడా హాజరు కారని చెప్పారు.
ఏకగ్రీవ రాజ్యసభ ఎన్నికలకు అవకాశం
వచ్చే రాజ్యసభ ఎన్నికలలో చంద్రబాబు రాజకీయ విన్యాసాలు చేసి నీతి మాలిన పనులకు పాల్పడితే మరింత చెడ్డ పేరును మూటగట్టు కుంటారని మేకపాటి హెచ్చరించారు. రాజ్యసభ ఎన్నికలలో మూడు సీట్లకు గాను రేండు సీట్లు టీడీపీకి, ఒక సీటు వైయస్సార్‌సీపీకి దక్కుతాయన్న ఆశాబావాన్ని వ్యక్తం చేశారు. ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనివ్వకుండా చంద్రబాబు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆయన కొంప కొల్లేరవుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ సీట్లుపెరుగుతాయని చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, ప్రతిపక్ష ఎంఎల్ ఏలను వంచించి తీసుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగదని కేంద్రం ఇది వరకే.స్పష్టంచేసిన సంగతిని గుర్తు చేశారు. ఇంతటి నీతి మాలిన ముఖ్యమంత్రి ( చంద్రబాబు ) దేశంలో ఎవరూ లేరని అన్నారు. ఆయనకు విశ్వసనీయత లేదని, ప్రజలు నమ్మడం లేదని మేకపాటి పేర్కొన్నారు.
శివరాంపురం, తాళ్లూరు మండలం, దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా ప్రత్యేక హోదాపై పోరాటం క్లైమాక్స్‌కు చేరింది శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి
పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనాయకులకు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం. ఢిల్లీ వెళ్తున్న పార్టీ నాయకుల వాహన శ్రేణికి జండా ఊపి ప్రారంభించిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి
మార్చి 5న ఢిల్లీలో ధర్నా, తర్వాత పార్లమెంటులో పోరాటం:
మార్చి 21న ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం:
చంద్రబాబు మాయ చేయడానికి యత్నిస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు:
ఆయన మంత్రులు పదవులు వదులుకోకపోవడమే దీనికి నిదర్శనం:
అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు ఎంపీలూ మద్దతు ఇచ్చేలా ఆయన పార్టనర్ పవన్‌కళ్యాణ్ చూడాలి:
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాం: శ్రీ వైయస్ జగన్
ఇప్పటికీ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు... అయినా ఎమ్మెల్యేలు లొంగడంలేదు, వారిపట్ల నాకు మరింతగా గౌరవం పెరిగింది: శ్రీ వైయస్ జగన్
ప్రత్యేక హోదా కోసం పోరాటం క్లైమాక్స్‌కు చేరుకుందని వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మార్చి 5న ఢిల్లీలో ప్రత్యేక హోదాకోసం ధర్నా చేస్తున్న నేపథ్యంలో... పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనాయకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండలం శివరాంపురం వద్ద ... శ్రీ వైయస్ జగన్ భేటీ అయ్యారు.
ప్రత్యేక హోదా పోరాటం క్లైమాక్స్‌కు చేరిందని శ్రీ వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. దీంట్లో భాగంగానే ఈనెల 1న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశామని, మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామంటూ తుదిదశ పోరాట ప్రణాళికను వివరించారు. మార్చి 5నుంచి పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమవుతాయని, మన పార్టీకి చెందిన 5 గురు ఎంపీలు పోరాటం చేస్తారని చెప్పారు. మార్చి 20 వరకూ ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేక్చాల్సిందిగా పార్లమెంటులో ఆందోళన చేస్తామని, అర్థిస్తామని, అందరికీ విజ్ఞప్తులు చేస్తామని చెప్పారు. అప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మార్చి 21న కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వెల్లడించారు.
చంద్రబాబుగారి పార్టనర్ పవన్‌కళ్యాణ్ ఉద్దేశాలేంటో.. తనకు తెలియవని, అయినా... ఆయనిచ్చిన సలహాను స్వీకరిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. కాని చంద్రబాబు మాత్రం – తన పార్ట్‌నర్ ఇచ్చిన సలహా ప్రకారం అవిశ్వాసానికి మాత్రం మద్దతు ఇవ్వకపోడం – చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో మరోసారి స్పష్టంచేస్తుందని జగన్ విమర్శించారు. చంద్రబాబు వద్దనున్న 20 ఎంపీలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత – చంద్రబాబు పార్టనర్‌పై ఉందని జగన్ అన్నారు.
ప్రత్యేక హోదాపై పోరాటం విషయంలో చిత్తశుద్ధే కాదు, చిత్తశుద్ధితో ఉన్నట్టుగా కూడా కనిపించాల్సిన అవసరం ఉందని జగన్ పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. ఎవ్వరూ కూడా వైయస్సార్‌సీపీ వైపు వేలెత్తిచూపించకుండా ఉండేందుకే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని పార్టీ నాయకులకు చెప్పుకొచ్చారు.
పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 184 నిబంధన కింద ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చకు యత్నిస్తున్నారని, దీంతోపాటు అవిశ్వాస తీర్మానం సందర్భంగా వచ్చే చర్చ సమయంలోనూ మన గళాన్ని గట్టిగా వినిపిస్తామని శ్రీ వైయస్ జగన్ చెప్పారు. ఏప్రిల్ 6న స్పీకర్ ఫార్మాట్లో ఉన్న 5గురు ఎంపీలు లోక్‌సభకు రాజీనా చేస్తారని శ్రీ వైయస్ జగన్ స్పష్టంచేశారు.
ఎంపీలకు పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణులు అండగా ఉంటారని, ప్రజలు వార్ని ఆదరిస్తారని ఈ సందర్భంగా శ్రీ జగన్ అన్నారు. చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం పోరాటం చేస్తున్నామని, ప్రజలుకూడా మనపైనే నమ్మకం పెట్టుకున్నారని ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదాపై పోరాటం ఉద్ధృతంగా నడుస్తున్న సమయంలో ప్రజలను అయోమయానికి గురిచేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని శ్రీ వైయస్ జగన్ విమర్శించారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగడం చంద్రబాబు మొదటి అస్త్రం కావాలని, ఎంపీలతో రాజీనా చేయించడం రెండో అస్త్రం కావాలని... కాని కేంద్ర మంత్రి పదవులకు తమ ఎంపీలు రాజీనామా చేయడం.... చంద్రబాబు ఆఖరి అస్త్రంగా చెప్తున్నారంటే.. ప్రత్యేక హోదాపై ఆయనకున్న వైఖరి, దాని అంతరార్థం ఇట్టే తెలిసిపోతున్నాయని శ్రీ వైయస్ జగన్ వ్యాఖ్యానించారు.
రూపాయో, అర్థరూపాయో తక్కువ అయిందన్నట్టుగా చంద్రాబు మాట్లాడుతున్నారు. ఆంధ్రా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ మనది ఒకటే నినాదమని ‘‘ప్యాకేజీతో మోసం చేయొద్దు – హెదా మన హక్కు’’ అని శ్రీ వైయస్ జగన్ స్పష్టంచేశారు. అలాగే విభజన హామీల విషయంలో కూడా మనకు రెండో ఆలోచన లేదని, చట్టంలో పేర్కొన్న ప్రకారం, అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రకటన ప్రకారం నూటికి నూరుశాతం హామీలను నెరవేర్చాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా విషయంలో క్లైమాక్స్ పోరాటానికి సిద్ధమైన పార్టీ నాయకులకు శ్రీ వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాం: శ్రీ వైయస్ జగన్
పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోమని శ్రీ వైయస్ జగన్ స్పష్టంచేశారు. చంద్రబాబు తాను కొనుగోలు చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో 4గురిని మంత్రులుగా కూడా చేసి ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేశారని శ్రీ వైయస్ జగన్ అన్నారు. దగ్గరుండి గవర్నర్ వారిచేత ప్రమాణస్వీకారం చేయించారని, ఇది ప్రజాస్వామ్యాన్ని హననం చేయడమేనని శ్రీ వైయస్ జగన్ అన్నారు. వచ్చే బడ్జెట్‌సమావేశాల సందర్భంగా ప్రతిపక్షం గైర్హాజరు కావడంతో – దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పరిహాసం అవుతున్న తీరు, రాజ్యాంగ ఉల్లంఘనలపై మరోసారి గట్టి చర్చజరుగుతుందని శ్రీ వైయస్ జగన్ చెప్పారు. ప్రతిపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన వ్యవహారాన్ని పాదయాత్రలో ప్రజలకు వివరిస్తున్నామని, ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ప్రజలు ఎండగడుతున్నారని శ్రీ వైయస్ జగన్ పార్టీనాయకులకు వివరించారు.
ఇప్పటికీ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు... అయినా ఎమ్మెల్యేలు లొంగడంలేదు, వారిపట్ల నాకు మరింతగా గౌరవం పెరిగింది: శ్రీ వైయస్ జగన్
త్వరలో జరగనున్న రాజ్య సభ ఎన్నికల సందర్భంగా ఫలితాన్ని తారుమారు చేయడానికి చంద్రబాబు ఇంకా ప్రయత్నిస్తున్నారని శ్రీ వైయస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రతి కదిలిక తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వాస్తవంగా చంద్రబాబు రాజ్యసభకు పోటీపెట్టకుండా.. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా చూడాల్సిందిపోయి... ఇప్పుడు మళ్లీ ప్రలోభాలకు దిగుతున్నారని శ్రీ జగన్ వెల్లడించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీగా ఆఫర్లు ఇస్తున్నారని, ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కాని ఇప్పుడున్న ఎమ్మెల్యేలు... ఆ ఆఫర్లను తిరస్కరించి చిత్తశుద్ధితో, నిజాయితీగా వ్యవహరిస్తున్నారని, వారిపట్ల ఉన్న గౌరవం మరింత పెరిగిందని శ్రీ జగన్ –ఎమ్మెల్యేలను ప్రశంసించారు. ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉన్నామని, చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని – విలువలు, విశ్వసనీయతే వైయస్సార్ కాంగ్రెస్ సిద్ధాంతమని పార్టీ నాయకులకు శ్రీ వైయస్ జగన్ మరోసారి స్పష్టంచేశారు.