ASBL Koncept Ambience

ప్రజా సంకల్ప యాత్ర – 306 వ రోజు ముఖ్యాంశాలు

ప్రజా సంకల్ప యాత్ర – 306 వ రోజు ముఖ్యాంశాలు

– శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం, నడిమికెల్ల శివారులోని శిబిరం నుంచి యాత్ర ప్రారంభం.
– శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు.
– యాత్రకు అన్ని వర్గాల ప్రజల సంఘీభావం.
– పాదయాత్ర ప్రారంభంలోనే విక్రమపురం వద్ద వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన శ్రీ వైయస్‌ జగన్‌.

– విక్రమపురంలో జననేతను కలిసిన స్థానిక రజకులు. ఆదరణ పథకంలో తమకు ప్రభుత్వం ఏ మేలు చేయలేదని ఫిర్యాదు చేసిన రజకులు. వాషింగ్‌ మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, ఇతర పనిముట్లు, ఉపకరణాలు ఏవీ తమకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఆక్షేపించిన రజకులు.

– గ్రామంలో పాదయాత్ర సందర్భంగా జననేతను కలిసిన ఉపాధ్యాయులు. తమకు ఎంతో నష్టం కలగజేస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు చేయాలని కోరిన ఉపాధ్యాయులు.

అధికారం చేపడితే సీపీఎస్‌ రద్దు చేస్తామని తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన టీడీపీ, రాష్ట్రంలో మాత్రం ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పడాన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. 

సీపీఎస్‌ రద్దుపై సానుకూలంగా స్పందించిన శ్రీ వైయస్‌ జగన్‌. అంతులేని హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు.

– ఆ తర్వాత చిట్టపులివలస క్రాస్‌ మీదుగా నడుకూరు చేరుకున్న శ్రీ వైయస్‌ జగన్‌. ఘన స్వాగతం పలికిన స్థానికులు.
– నడుకూరులో మహానేత వైయస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జననేత.

– గ్రామంలో జననేతను కలిసిన అగ్రిగోల్డ్‌ బా«ధిత మహిళలు. సంస్థను నమ్మిన తాము ఎంతో మోసపోయామని, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పని చేస్తోందని విపక్షనేత వద్ద మొర పెట్టుకున్న మహిళలు. 

అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన ఆస్తి హాయిల్యాండ్‌ను చౌకగా తన కుమారుడికి కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన బాధిత మహిళలు. శ్రీ వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేసిన మహిళలు.

– తిత్లి తుపానుతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఏ రకంగానూ ఆదుకోలేదని నడుకూరులో జననేతను కలిసిన కౌలు రైతు బి.గౌరీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను తాకిడికి నష్టపోయిన పొలం, వరి కంకులను విపక్షనేతకు చూపిన ఆయన, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని చెప్పారు. ఎలాగైనా ఆదుకోవాలని ఆయన జననేతను వేడుకున్నారు. 

– అక్కణ్నుంచి వీరఘట్టం చేరుకున్న శ్రీ వైయస్‌ జగన్, శివారులోని తాత్కాలిక శిబిరం వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగారు.

– శిబిరం వద్ద జననేతను కలిసిన రాంప్రసాద్‌ దంపతులు తమ బాధ చెప్పుకున్నారు. టెక్కలిలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండో ఏడాది విద్యార్థి అయిన తమ కుమారుడు హర్షవర్ధన్‌ గత జూలై 24న నౌపాడ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడని తెలిపారు. 

తమ కుమారుడిని హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా, పట్టించుకోకుండా పోలీసులు కేసు నీరు గార్చారని, హర్షవర్థన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేసు నమోదు చేశారని రాంప్రసాద్‌ దంపతులు ఆక్షేపించారు. ఈ కేసు విషయంలో జోక్యం చేసుకుని చనిపోయిన తమ కుమారుడిని న్యాయం చేయాలని, బాధ్యులకు తగిన శిక్ష పడేలా చేయాలని రాంప్రసాద్‌ దంపతులు విపక్షనేతను వేడుకున్నారు.

వారి బాధను సావధానంగా విన్న శ్రీ వైయస్‌ జగన్, పార్టీ అధికారం చేపడితే.. ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. 

– ఇక అంతకు ముందు దారి పొడవునా జననేతను కలిసి సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు. తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరిన తల్లులు. సెల్ఫీల కోసం ఆరాట పడిన మహిళలు, విద్యార్థినిలు.

– శ్రీ వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులు వేసిన రైతులు, మహిళలు, విద్యార్థులు. ఇంకా ఆయనకు స్వాగతం చెప్పేందుకు పలు చోట్ల బారులు తీరిన ప్రజలు.  

– జననేతతో కరచాలనం కోసం పోటీ పడిన బస్సులు, ఇతర వాహనాల ప్రయాణికులు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ యాత్రలో ముందుకు సాగిన శ్రీ వైయస్‌ జగన్‌.

 

Tags :