అనంతపురం జిల్లా పాపంపేటలో వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే.. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు.
* నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయ్. రూ.500-రూ.1000పైనే వస్తున్నాయ్.
* బాబు ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏవీ ఇవ్వటం లేదు. గతంలో అన్ని రకాల నిత్యావసరాల వస్తువులు ఇచ్చేవారన్న సంగతి గుర్తు చేసిన శ్రీ జగన్.
* ఎన్నికలప్పుడు ప్రతి పేదవాడికీ మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో ఒక్కరికైనా ఇళ్లు కట్టించారా అని నిలదీసిన శ్రీ వైయస్ జగన్
* జాబు రావాలంటే బాబు రావాలని యువతను మోసం చేశారు. జాబు ఇవ్వకపోతే రూ.2000 నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. బాబు వచ్చి 45 నెలలు అయింది. ప్రతి ఇంటికి రూ.90వేలు బాకీ పడ్డారని తెలిపిన శ్రీ జగన్.
* వ్యవసాయ రుణాలు, డ్వాక్రారుణాలు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. రుణాలు మాఫీ కాలేదు.. బ్యాంకులు మాత్రం నోటీసులు పంపుతున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ పేరున వడ్డీకి కూడా డబ్బులు చెల్లించలేదన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు కూడా ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు.
* బేషరుతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు.
* ప్రత్యేక హోదాను సంజీవని 5 సంవత్సరాలు కాదు.. 15సంవత్సరాలు కావాలన్నారు. నాలుగేళ్ల తర్వాత ప్రశ్నిస్తున్నా.. ప్రత్యేక హోదా తీసుకువచ్చారా అని శ్రీ జగన్ నిలదీశారు.
* చెరువు-చేప-కొంగ కథ చెప్పి బాబు కూడా రాష్ట్రాన్ని ఇలాగే దోపిడీ చేశారని వివరించిన శ్రీ వైయస్ జగన్.
* చంద్రబాబు ప్రజల్ని నమ్మించి మోసం చేశారన్న శ్రీ జగన్.
* రైతుల్ని, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల్ని, యువతను చంద్రబాబు తినేశారు.
* నాన్నగారి హయాంలో ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారు. బాబు వచ్చాక నీళ్లకు కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* చంద్రబాబు వచ్చాక మాఫియా పాలన సాగుతోంది. జన్మభూమి కమిటీలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ మాఫియా గ్రామాలను దోచేస్తోంది.
* అనంతపురంలో ప్రత్యర్థులను చంపించటం కోసం హత్యలు చేశారు. సొసైటీ అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి ఆఫీసులోనే చంపారు. ప్రసాద్ రెడ్డిని ఎమ్మార్వో ఆఫీసులోనే చంపారు. బీసీ సెల్ ధనుంజయ్ యాదవ్ చంపటానికి కుట్ర పన్నారు. రాజకీయాలు భ్రష్టుపట్టారు.
* రాజకీయాల్లో విశ్వసనీయత రావాలి. రాజకీయ నాయకుడు చెప్పిన పని చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే విశ్వసనీయత రావాలి. శ్రీ జగన్ కు మీ అందరి సహకారం కావాలి అని కోరారు.
* ప్రజాసంకల్పయాత్ర ద్వారా 3000 కి.మీ పాదయాత్ర చేస్తోంది అన్ని వర్గాలకు భరోసా ఇవ్వటానికే అని శ్రీ జగన్ తెలిపారు. రైతులు, మహిళలు, యువతకు భరోసా ఇస్తున్నామన్నారు.
* నవరత్నాల్లో మనం వచ్చాక చేయబోయే మంచిని తెలియజేస్తున్నాము. వాటిల్లో మార్పులు చేర్పులు చేయాలన్నా మీ సలహాలు ఇవ్వమని శ్రీ జగన్ కోరారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఆదుకుంటామని శ్రీ జగన్ తెలిపారు. బాబు వచ్చాక బ్యాంకులకు వడ్డీలు కట్టడం లేదని దీంతో అక్కచెల్లెమ్మలు రూ.2లు వడ్డీ కడుతున్నారని శ్రీ జగన్ తెలిపారు.
* దేవుడు ఆశీర్వదించి మీరు దీవిస్తే మీ అన్న ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే ఎంత మంచి జరుగుతుందో చేసి చూపిస్తానన్న శ్రీ వైయస్ జగన్. ఎంతైతే అప్పు ఉంటుందో.. ఆ మొత్తం నేరుగా మీ చేతికే 4 దఫాలుగా ఇస్తానని ప్రకటించారు. ఎన్నికలు అయ్యాక..రెండో రోజు అప్పులు ఎంత ఉన్నాయో.. బ్యాంకుల దగ్గరకు వెళ్లి రిసిప్టు మీ దగ్గర పెట్టుకుండి. ఆ మొత్తం నేరుగా మీ చేతికే ఇస్తానని శ్రీ జగన్ తెలిపారు.
* అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు నవరత్నాల్లో ఈ వైయస్ఆర్ ఆసరా ఎంతో ఉపయోగపడుతుందని ప్రకటించామని శ్రీ జగన్ తెలిపారు.