ప్రజా సంకల్ప యాత్ర – 308 వ రోజు ముఖ్యాంశాలు
– శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం, అట్టలి శివారులోని శిబిరం నుంచి యాత్ర ప్రారంభం.
– శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు.
– యాత్రకు అన్ని వర్గాల ప్రజల సంఘీభావం.
– శ్రీ వైయస్ జగన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కాంక్షిస్తూ శిబిరంలో ఆయనను ఆశీర్వదించిన సింహాచలం వేద పండితులు.
– మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా పాదయాత్ర ప్రారంభానికి ముందు శిబిరంలో ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన శ్రీ వైయస్ జగన్.
– పాదయాత్ర ప్రారంభంలో శిబిరం వద్ద జననేతను కలిసిన అట్టలి, తలవరం, బుక్కూరు, తెట్టంగి రైతులు. పలు అంశాల ప్రస్తావన. తోటపల్లి ప్రాజెక్టు కింద హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని, ఏటా వరదల్లో గ్రామాలు మునిగిపోకుండా గెడ్డలు వెడల్పు చేయాలని విపక్షనేతకు విజ్ఞప్తి చేసిన రైతులు.
– పాదయాత్రలో తొలుత తుమరాడ చేరుకున్న శ్రీ వైయస్ జగన్. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.
– గ్రామంలో జననేతను కలిసిన కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) ఉద్యోగులు. తమకు ఎంతో నష్టం కలిగిస్తున్న పథకాన్ని రద్దు చేయాలని కోరిన ఉద్యోగులు. సానుకూలంగా స్పందించిన విపక్షనేత.
పార్టీ అధికారం చేపడితే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని మరోసారి శ్రీ వైయస్ జగన్ స్పష్టీకరణ. జననేత హామీపై హర్షం ప్రకటించిన సీపీఎస్ ఉద్యోగులు.
– ఆ తర్వాత తంపటాపల్లి చేరుకున్న శ్రీ వైయస్ జగన్. జననేతను చూసేందుకు కదలి వచ్చిన ఊరూ వాడ.
– గ్రామంలో విపక్షనేతను కలిసిన ఐటీడీఏ తాత్కాలిక ఉద్యోగులు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్న ఐటీడీఏ తాత్కాలిక సిబ్బంది.
– తరచూ సంభవిస్తున్న వరదల వల్ల పంటలకు నష్టం కలుగుతోందని, అందువల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని గ్రామంలో జననేతను కోరిన రైతు నేత చందక జగదీష్. ఆయన వెంట విపక్షనేతను కలిసిన పలు గ్రామాల రైతులు.
– గ్రామంలో జననేతను కలిసి యాత్రకు సంఘీభావం ప్రకటించిన శెట్టిబలిజ కులస్తులు. అధికారం చేపడితే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం చేస్తామన్న శ్రీ వైయస్ జగన్ హామీపై హర్షం ప్రకటించిన శెట్టి బలిజ కులస్తులు.
– నాడు దివంగత మహానేత వైయస్సార్ హయాంలో చక్కగా సేవలందించి అనేక మంది ప్రాణాలు కాపాడామని, కానీ టీడీపీ అధికారం చేపట్టాక తమకు భద్రత లేకుండా పోయిందని జననేత వద్ద వాపోయిన 108 సర్వీసు ఉద్యోగులు. ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విపక్షనేతను వేడుకున్న 108 సర్వీసుల సిబ్బంది.
– అనంతరం ఎల్.ఎల్.పురం క్రాస్ చేరుకున్న శ్రీ వైయస్ జగన్. పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వాగతం చెప్పిన గ్రామస్తులు.
– తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులం కావడంతో ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, చివరకు ఊరికి రోడ్డు కూడా వేయడం లేదని జననేతకు ఫిర్యాదు చేసిన అరదలి గ్రామస్తులు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని వారిలో విశ్వాసం పెంచిన జననేత.
– గ్రామంలో పాదయాత్ర అనంతరం శివారులోని తాత్కాలిక శిబిరం వద్ద మధ్యాహ్న భోజనం కోసం ఆగిన శ్రీ వైయస్ జగన్.
– ఇక అంతకు ముందు దారి పొడవునా జననేతను కలిసి సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు. తమ బిడ్డలను ఆశీర్వదించమని కోరిన తల్లులు. సెల్ఫీల కోసం ఆరాట పడిన మహిళలు, విద్యార్థినిలు.
– శ్రీ వైయస్ జగన్‌తో కలిసి అడుగులు వేసిన రైతులు, మహిళలు, విద్యార్థులు. ఇంకా ఆయనకు స్వాగతం చెప్పేందుకు పలు చోట్ల బారులు తీరిన ప్రజలు.
– జననేతతో కరచాలనం కోసం పోటీ పడిన బస్సులు, ఇతర వాహనాల ప్రయాణికులు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ యాత్రలో ముందుకు సాగిన శ్రీ వైయస్ జగన్.