ASBL Koncept Ambience

జగన్‌ మంచి ముఖ్యమంత్రి.. అని మీ అందరితో అనిపించుకుంటా..

జగన్‌ మంచి ముఖ్యమంత్రి.. అని మీ అందరితో అనిపించుకుంటా..

ఆరు నెలల నుంచి ఏడాది లోగానే.. ఆ దిశలోనే నా ప్రతి అడుగు ఉంటుంది. నవరత్నాలు తీసుకొచ్చేలా పరిపాలన

శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ

అఖండ విజయం తర్వాత జననేత ప్రకటన

‘గవర్నెన్స్‌ అంటే ఏమిటి? గొప్ప గవర్నెన్స్‌ అంటే ఎలా ఉంటుంది? అన్నది ఇవాళ చెబుతా ఉన్నాను. ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే.. జగన్‌ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో అనిపించుకునేట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. అదే విధంగా నవరత్నాలు తీసుకొచ్చే విధంగా పాలన అందిస్తాను’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 

ఉమ్మడి రాష్ట్రంలోనూ గతంలో ఏనాడూ లేని విధంగా ఈ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అసాధారణ స్థాయిలో, అఖండ విజయం సాధించిన అనంతరం ఈ సాయంత్రం విజయవాడ, తాడేపల్లిలోని తన నివాసంలో శ్రీ వైయస్‌ జగన్‌ కాసేపు మాట్లాడారు. తనను అభినందించేందుకు వచ్చిన వేలాది అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన క్లుప్తంగా ప్రసంగించారు.

నూతన అధ్యాయం

‘ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుషా ఇటువంటి గొప్ప విజయం ఎప్పుడు కూడా రిజిస్టర్‌ కాలేదేమో!. నాకు తెలిసి 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం.. 175 నియోజకవర్గాలకు దాదాపుగా 153కు పైగా నియోజకవర్గాలు రిజిస్టర్‌ కావడం బహుషా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అ«ధ్యాయం’ అని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. 

అందరి చల్లని దీవెనలు

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ విజయం సాధ్యమైందని, ఇవాళ తాను అందరి ఎదుట ఇక్కడికి వచ్చి నిల్చుని మాట్లాడగలగడం నిజంగా ఒక అదృష్టం అని చెప్పారు. అది కేవలం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్లనే సాధ్యమైందని గర్వంగా చెబుతున్నానని అన్నారు. 

బాధ్యతను పెంచింది

ఈ విజయం తన మీద ఉన్న బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచుతుందని శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేశారు అంటే, అది విశ్వసనీయతకు ఓటు వేయడమే అని స్పష్టం చేశారు. ఆ విశ్వసనీĶæత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ప్రజలు ఇవాళ తమ ఓటు ద్వారా ఓటు వేసి చూపించారని గుర్తు చేశారు.

ఈరోజు ఇంత గొప్ప మాండేట్‌ ఇచ్చిన తర్వాత ప్రజలందరికి తాను ఇవాళ ఒకటే ఒకటి చెబుతున్నానని.. అయిదు కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఇస్తారని చెప్పారు. ఇప్పుడు ఆ అవకాశం దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో తనకు వచ్చిందని అన్నారు. 

గొప్ప గవర్నెన్స్‌..

‘ఆ అవకాశం ఒకరికి వస్తుంది. ఒకరికి వచ్చినప్పుడు గవర్నెన్స్‌ అంటే ఏమిటి? గొప్ప గవర్నెన్స్‌ అంటే ఎలా ఉంటుంది? అన్నది నేను ఇవాళ చెబుతా ఉన్నాను. ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే.. జగన్‌ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో అనిపించుకునేట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మాత్రం కచ్చితంగా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. 

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు 

‘మరొక్కసారి నా మీద ఈ విశ్వాసం ఉంచినందుకు పేరు పేరునా ఆం«ధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని జననేత తెలిపారు.

తొలి సంతకం–నవరత్నాలు

మొదటి సంతకం ఏం పెట్టబోతున్నారని అడుగుతున్నారన్న శ్రీ వైయస్‌ జగన్‌.. ‘మొదటి సంతకం కాదు, నవరత్నాలు అన్నది నేను గట్టిగా నమ్ముతున్నాను. 3600 కి.మీ నా పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలు చూశాను. వారి బాధలు విన్నాను. నేను చూశాను. నేను విన్నాను. నేను ఉన్నాను. అని చెప్పి మీ అందరికీ చెబుతా ఉన్నాను. ఒక సంతకం కాదు. నవరత్నాలు తీసుకువచ్చే పాలనను ఇవ్వబోతున్నామని మీ అందరికీ కచ్చితంగా చెబుతున్నాను’ అని ప్రకటించారు.

30న ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం ఇక్కడే విజయవాడలోనే జరుగుతుందని, ఈనెల 30న ఆ కార్యక్రమం ఉంటుందని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

 

Tags :