ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన వైయస్సార్ సీపీ
కాకినాడ మీడియా సమావేశంలో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్
ఏపీకి ప్రత్యేకహోదాఈ, విభజన హామీల అమలులో... కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేపట్టాలి. చేంద్రబాబుపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు మంగళవారం నాడు బంద్‌కు పిలుపు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన చేయాలి. బంద్ విజయవతం అయ్యేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలి.
పార్లమెంటులో జరిగిన సన్నివేశాలు బాధను కలిగిస్తున్నాయి. పార్లమెంటు ప్రొసీడింగ్స్‌ను మనమంతా చూశాం .. జరిగిన విషయాలను తెలుసుకున్నా. చర్చ సందర్భంగా ఏపీపై పెద్దలకున్న ప్రేమను చూసినపుడు బాధ అనిపించింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ దాకా ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తూ ఎవరూ మాట్లాడలేదు. ఏ ఒక్కరి నుంచి హోదా కావాలన్న మాట రాలేదు. అన్నిటికన్నా బాధాకరం, నాలుగు సంవత్సరాల హామీలు అమలు చేయకపోగా... తీర్మానంపై చర్చలో హోదా ఇస్తామన్న మాటే లేదు .. హోదా అన్న పదం ఏ ఒక్కరి నోట్లో నుంచి రాలేదు. తిరుపతి ఎన్నికల వేళ ఏపీకి హోదా ఇస్తామన్న .... మాటలు నరేంద్ర మోదీకి గుర్తుకు రాలేదు. హోదా ఇస్తామని ఎన్నికల ప్రణాలికలో కూడా పేర్కొన్నారు. మానిఫెస్టోలో కూడా ఇదే హామీ ఇచ్చారు.
కేంద్రం చంద్రబాబుతో మాట్లాడిన తరువాత,, ఆయన ఆమోదంతో హోదాకు బదులు ప్యాకేజి .. ఇచ్చామని చెబుతున్నారు నరేంద్ర మోదీ అలా చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆ అధికారార్ని ఎవరిచ్చారు? ఈ విషయంలో కేంద్రంతో రాజీ పడటానికి ఆయనెవరు? హోదాను పక్కపపెట్టి ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఎవరిచ్చారు మీకు ఆఅధికారాలను? లోక్‌సభలో ప్రధాని మాటలు బాధ కలిగించాయి. అయిదు కోట్ల మంది ప్రజలున్నారు. రాహుల్ గాంధీ అరనిమిషం గురించి హోదా గురించి మాట్లాడలేదు. ఏపీ హోదా అన్న మాట లేదు. మీరెందుకు ఇవ్వడం లేదన్ని మాట ప్రశ్నించలేదు.?
చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఇంకా బాధ కలిస్తున్నాయి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాటలు నాలుగు సంవత్సరాలుగా మేము చెబుతున్నవే. మా మాటలనే ఆయన ఉటంకించారు.ఈవిషయం నిజమా కాదా? కాదా అని చంద్రబాబు. అసెంబ్లీలో రికార్డులు, యువభేరీలో వినతిపత్రాలు నా ప్రసంగాలు చూడండి. డిల్లీ నుంచి గల్లీ దాకా మా ప్రసంగాలు చూడండి.నిరాహార దీక్షలలో మా ప్రసంగాలను చూడండి. అప్పట్లో మమ్మల్ని వెక్కరించారు. హోదా నిరుపయోగం అన్నారు. కోడలు మగ బిడ్డను కంటే అత్త వద్దంటుందా? ఆదేమన్నా సంజీవనా? అని వెటకారం చేశారు.
అసెంబ్లీ మాటలు చూసి విస్తు పోయే పరిస్థితి. ప్రజా ప్రతినిధులకు ఒక అవగాహన అంటూ హోదా .. నష్టాలను ప్యాకేజి లాభాలను వివరించారు. చంద్రబాబు టీడీపీ తీర్మానంలో హోదా లేని రాష్ట్రాలకు హోదా .. కలిగిన రాష్ట్రాలకు తేడా ఏముందన్నారు. హోదాకు రాయితీలకు తేడా లేదన్నారు. కేవలం ఉనికి కోసం మా ఆందోళన్నారు. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సులు చూడండి. కేంద్ర కేబినెట్ హోదాపై ప్లానింగ్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు ఉన్నపుడు ప్లానింట్ కమిషన్ అమలులో ఉంది.
రెండు నెలల పాటు హోదా గురించి పట్టించుకోలేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు అరుణ్ జైట్లీతో చర్చించి ప్యాకేజీ కుదుర్చుకున్నారు. మనందరికీ కాలీ ఫ్లవర్ పెట్టారు. అప్పటి టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ పక్కన ఉండి చర్చలు జరిపారు. చంద్రబాబు ఆమోదంతోనే ఆరుణ్ జైట్లీ ప్యాకేజి ప్రకటించారు. అందుకు సీఎం ధన్యావాలు తెలిపారు. అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మీకిది ధర్మమేనా చంద్రబాబు? ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని పొగిడారు కదా చంద్రబాబూ. మనమే ఎక్కువ సాధించామని, ఇతర రాష్ట్రాలు .. మనకన్నా ఎక్కువ సాదించాయా? అని అడిగారే. మీకిది ధర్మమేనాది చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ చివరి రోజున వైయస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు .. తమ పదవులకు రాజీనామా చేశారు. ఆమరణ నిరాహార దీక్షకు చూర్చున్నారు.
టీడీపీ ఎంపీలు రాజీనామాలు అపుడే తమ పదవులకు రాజీనామా చేసి ఉంటే గనక జాతీయ ష్టాయిలో ఒత్తిడి పెరిగి కేంద్రం దిగి వచ్చి ఉండేది. ఇవన్నీ తెలిసి టీడీపీ ఎంపీలచేత రాజీనామాలు చేయించలేదు చంద్రబాబు. ఇపుడు కూడా ఆయన గారి ప్రవర్తిస్తున్న తీరును చూడండి. బీజేపీతో యుద్దం చేస్తాడట. బయట యుద్దం-లోపల నెయ్యం. అనుమానలు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. పరకాల ప్రభాకర్ చంద్రబాబు మీడియా సలహాదారుడు. ఆయన భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య టీటీడీ బోర్డు సభ్యురాలు. చంద్రబాబు నరేంద్ర మోదీని గట్టిగా మద్దతు ఇస్తారు. రాజ్‌నాథ్‌సింగ్, చంద్రబాబు మామిత్రుడు ...ఆ స్నేహం బంధం విడిపోదన్నారు. చంద్రబాబు పైకి యుద్దం అంటారు. యుద్దం కాదిది లోపాయికార ఒప్పందాలివి.
ఎన్నికలకు ఆరునెలల ముందు బీజేపీ నుంచి విడిపోయారు చంద్రబాబు. హోదాకు తూట్లు పొడిచారు. విడాకులు తీసుకుని హోదా కోసం పోరాటం అని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబుకు నిజాయితీ లేదు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గారు చూపించిన పత్రాలను గతంలో మేమూ చూపించాం. అభిజిత్ సేన్, గోవిందరావు ప్రకటనలను ప్రస్తావించాం. హోదాపై అప్పటి కేబినెట్ తీర్మానం చూపించాం. వైయస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు ... కేంద్ర మంత్రి జవాబిస్తూ ఆయా రాష్ట్రాలకు హోదా కొనసాగుతున్నాయన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి చెబుతున్నా పట్టించుకోలేదు. అనేక ప్రచార పత్రాలు పంపాం. ఎన్నెన్ని పోరాటాలు చేసిందీ ప్రజలకు వివరించాం. హోదా కోసం అనేక పోరాటాలు చేశాం. ఇవేవీ టీడీపీ పట్టించుకోలేదు. తమమోసాలు కొనసాగించారు.
చంద్రబాబు అవిశ్వాసం పెడితే ఆమోదించారు. అదే తీర్మానాన్ని మేము ప్రవేశపెడితే చర్చకు రానివ్వలేదు బాబు గారు. టీడీపీ ఎంపీకి 13 నిమిషాల వ్యవధి అని చెప్పి గంట పాటు మాట్లాడించారు. కేంద్ర వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి. 25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్షకు కూర్చుందాం. అపుడు కేంద్రం దిగిరాకపత్పదు. ఒక్క తాటిపై నిబడితే దేశం మన వైపు చూస్తుంది.కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం. అదీ యుద్దం అంటే.. ఇలా చేస్తేనే హోదా వస్తుంది. ఏపీలో మంగళవారం నాడు బంద్ కు పిలుపు ఇస్తున్నాం. చంద్రబాబుపై ఒత్తిడి రావాలి. ఏపీ ప్రజలు నిరసన తెలుపుతున్నారని కేంద్ర రాష్ట్రాలకు అర్థం కావాలి. ఎవ్వరినీ నమ్మకండి. నమ్మి మోసపోయింది చాలు.