అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
విలేజ్ మాల్స్‌ను కొత్తగా ప్రారంభించారు చంద్రబాబు. రేషన్‌షాపులను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా మార్చారు. వీటిలో నిత్య వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో అర కిలో చక్కెర ధర 6-70 ఉంటే హెరిటేజ్ మాల్స్‌లో రూ 25. అదే పామాయిల్ లీటరు రూ 40 ఉంటే చంద్రన్న మాల్స్‌లో రూ 85. పామాయిల్ డిస్‌కౌంటు తరువాత రూ 77 రూపాయలు. బహిరంగ మార్కెట్‌లో గోధుమ పిండి కిలో 16-50. ఇవాళ మాల్స్‌లో అదే గోధుమ పిండి ధర రూ 50 ..డిస్కౌంటు మినహా 44. గోధుమలు కిలో 7.. మాల్స్‌లో కిలో 28 నుంచి 35 రూపాయలు వరకు ఉంటోంది. కారంపుడి పావు కిలో20. మాల్స్‌లో 75..డిస్కౌంటు పోను రూ 72. చింతపండు మాల్స్ ఎక్కువగా ఉంటోంది. విలే్ మాల్స్‌లో రేట్లు, బహిరంగ మార్కెట్ రేట్ల కంటే హెచ్చుగా ఉంటున్నాయి.. అయితే చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తున్నట్లు పోజు కొడుతున్నారు. మాల్స్‌లోలో తక్కువ ధరలున్నట్లు పోజు పెడుతున్నాడు. ప్రజలకు మంచి చేస్తున్నట్లు పోజిస్తున్నారు. ఇది వరకు నిత్య వస్తువుల దరలు అతి తక్కువగా ఉండేవి. చంద్రబాబు మోసం ఏ విధంగా ఉందో మాల్స్‌ను చూస్తే తెలుస్తుంది. ప్రతి సంక్షేమ పథకం కత్తిరింపులకు గురి అవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు మోసం మాటలు చెప్పారు. 4 ఏళ్ళ చంద్రబాబు పరిపాలన ఇలా ఉంది. ప్రజా సమస్యలను ఏ మాత్రం పరిస్కరించలేదు ఆయన ఎన్నికలు వచ్చే సరికి ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి ఒక మారుతీ కారు కొనిస్తానంటారు చంద్రబాబు. సినిమా నటులను పక్కన పెట్టుకుని ప్రచారానికి వస్తారు చంద్రబాబు. బాహుబలి డైరెక్టరు ను అమరావతిపై సినిమా తీయాలని చెప్పాడట. అమరావతిపై సినిమా తీయాలని చెబితే సెట్టు వేస్తారు డైరెక్టరు అదిగో అమరావతి వచ్చేసిందని బిల్డప్ అటువంటి డైరెక్టర్లనే పిలిపించి మాట్లాడిస్తాడు. అమరావతిలో ఒక ఇటుకు పడలేదు ఇప్పటి దాకా చంద్రబాబు కష్టజీవి అని కేంద్రం సహకరించడం లేదనిచెప్పిస్తారు ఆడైరెక్టర్లతో అలాంటి నటులను ప్రశ్నించండి.
ప్రజలలో చైతన్యం వస్తే చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన పరిటాల సునీతమ్మ కేబినెట్ మంత్రి హంద్రీనీవా, పెన్నహోబిళం ప్రాజెక్టుల కింద పిల్ల కాలువలు తవ్వలేదు. వైయస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. హంద్రీనీవా నుంచి జీడిపల్లి దాకా క`ష్ణా నదీ జలాలు సరఫరా చేశారు. రాస్తాడులో లో ఎకరాలకు నీరిస్తాం. లంచాల వల్లే ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాలలో జాప్యం అవుతున్నాయి. చంద్రన్న బీమా పథకం వల్ల ప్రయోజనం లేదు. చంద్రబాబు వంటి మోసాలు మా ప్రభుత్వంలో ఉండవు.