సైదాపురంలో పైలాన్ ఆవిష్కరించిన వైఎస్ జగన్
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు.
ప్రజా సంకల్పయాత్ర వేయి కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా "వాక్ విత్ జగన్" కార్యక్రమం విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సామరంగ్ చౌక్ నుంచి నగర వీధుల్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ నందమూరి లక్ష్మిపార్వతి, పార్టీ నేతలు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
శ్రీశైల నియోజకవర్గం, ఆత్మకూరులో బుడ్డా శేషిరెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో చిన్నారులు జగన్ మోహన్ రెడ్డి గారి మాస్క్ లతో విన్నూత్నముగా ఆలరించారు. సుమారు వెయ్యి మందితో భారీ ర్యాలీ నిర్వహించిన వైసిపి శ్రేణులు..
నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవికిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన వైసిపి శ్రేణులు..
కర్నూల్ నగరంలో అట్టహాసంగా వాక్ విత్ జగనన్న కార్యక్రమం జరిగింది. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా సంఘీభావ పాదయాత్ర లో పాల్గొన్నారు. కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ హాఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో, సిటీ ప్రెసిడెంట్ రాజా విష్ణువర్ధన్ రెడ్డి సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై.రామయ్య, దళిత, మైనార్టీ, మహిళా కారుకర్తలు నాయకులు పాల్గొన్నారు.