ASBL Koncept Ambience

వాషింగ్టన్‌ డీసీలో జగన్‌కు ఘన స్వాగతం

వాషింగ్టన్‌ డీసీలో జగన్‌కు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా  వాషింగ్టన్‌ డీసీ చేరుకున్నప్పుడు ఆయనకు ఘనస్వాగతం పలికారు. డ్యూలస్‌ ఎయిర్‌పోర్టులో భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌(ఐఏఎస్‌)తోపాటు ఎన్నారై వైఎస్‌ఆర్‌సిపి అభిమానులు, ఇతరులు ముఖ్యమంత్రిని ఘనంగా ఆహ్వానించారు. కాగా వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశం అనంతరం.. సీఎం జగన్‌ నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) ఉంటుంది. అనంతరం డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. 

 

Tags :