కొరియాకు ముఖ్యమంత్రి వెళితే పెట్టుబడులు వస్తాయా?
అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు బహిరంగ సభలో వైఎస్ జగన్
ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణ కొరియాలో ఉన్నాడు. ప్రయివేటు విమానంలో ఇష్టమొచ్చిన దేశానికి వెళతారాయన. ఆయా దేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెట్టండంటారు. మీరు రాండి అని పిలుస్తారు. అమరావతి రెండో దేశ రాజధాని అని చెబుతారు. ఎవరు వస్తారు ఆయన ముఖం చూసి? పరిశ్రమల పేరుతో విదేశాలకు వెళ్ళి వస్తున్నారు. చంద్రబాబు ఎంఎల్ ఏలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్ ఏకు రూ 25-30 కోట్లు ఇస్తున్నారు. పార్టీ పిరాయింపులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారు.
తాడిపత్రి నియోజకవర్గంలో కడప స్టోన్, గ్రానైట్
పరిశ్రమలున్నా ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిశ్రమ చాల వరకు దెబ్బతింది. చంద్రబాబు విద్యుత్ యూనిట్ ధర రూ 3-70 నుంచి రూ 8-70 కు పెంచారు. చదరపు మీటరు రాయల్టీని రెండింతలు పెంచారు. ఈ కారణాల వల్ల చంద్రబాబు హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్త పరిశ్రమలు మాటేమో గానీ ఉన్నవి మూతు పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆయనకు బుద్ది జ్నానం లేదు.
ఆయన చేసేవన్నీ వెధవ పనులే. అన్యాయం పనులే... దిక్కు మాలినవి. తాడిపత్రి నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీటిని కేటాయించలేదు. తుంగభద్ర ఎగువ కాలువ కింద ఏటా అయిదు నెలల పాటు పారేవి. ఈ కెనాల్‌లో లో ఇపుడు నీరు కనిపించటం లేదు. హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తి అయ్యాయి. చంద్రబాబు 20 శాతం పనులను పూర్తి చేయడం లేదు. పిల్ల కాలువలు లేవు ఈ కాలువల కింద దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీరివ్వచ్చు. చంద్రబాబు రేషన్‌దాఫులను నిర్వీర్యం చేశారు. ఈషాపులలో ఒక్క బియ్యం ఇతర సరుకులు ఏవీ దొరకడం లేదు. ఇపుడు రేషన్ షాపులలో సరుకులు ఏవీ దొరకడం లేదు. గతంలో ఇవే షాపులలో 9 రకాల నిత్య వస్తువులు లభించేవి. వాటిని అభివృద్ధి చేయడం మాని ... గ్రామాలలో రిలయన్స్ సంస్థ ద్వారా మాల్స్ పెట్టిస్తారట. వీటిలో 20 శాతం తక్కువ ధరలట. ఈషాపులను చివరకు హరిటేజ్ అప్పగిస్తారేమో. ఫ్యూచర్ సంస్థ కింద షాపులు నడుస్తాయేమో. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారు. ఏపీలో న్యాయం లేదు దర్మం లేదు. ఇసుక, మట్టి, మద్యం, కాంట్రాక్టర్లు, బొగ్గు, రాజధాని, గుడి భూములను కూడా వదలడం లేదు. గ్రామ గ్రామాన లంచాల మయం. ఈ దుష్పరిపాలన పోవాలి.