రేణమాలలో మహిళలతో వైయస్ జగన్ ముఖాముఖి
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాలలో మహిళలతో శ్రీ వైయస్ జగన్ ముఖాముఖిలోని ముఖ్యాంశాలు
- నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మనం పడిన అవస్థలపై రోజా గారు తెలిపారు.
- పెందుర్తిలో దళిత మహిళ మీద టీడీపీ నేతలు దాడి చేయటం అమానుషం.
- మహిళలపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు చోద్యం చూశారు తప్ప చర్యలు తీసుకోలేదు.
- మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే పరిస్థితి దిగజారేది కాదు.
- ఎమ్మెల్యేకు అండగా చంద్రబాబు నిలిచాడు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితం మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగాయి.
- చంద్రబాబు తొలి సంతకం బెల్ట్ షాపులపై చేశారు. కానీ ఈ రోజున మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో మద్యం షాపుల ముందు నుంచి మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది.
- మద్యం నుంచి పిల్లలను రక్షిస్తానని ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ సంగతే మరిచిపోయారు.
- గ్రామాల్లో మినిరల్ వాటర్ ఉందో లేదో తెలీదు కానీ బెల్ట్ షాపులేని గ్రామాన్ని చంద్రబాబు తెచ్చారు.
- ఫోన్ కొడితే మద్యాన్ని ఇంటికి తీసుకువచ్చే పరిస్థితి చంద్రబాబు తెచ్చారు.
- మద్యం ఆదాయం ప్రతి ఏటా 20శాతం పెంచుతున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
- ఆర్థిక చిక్కుల్లో పడిన పొదుపు సంఘాల రుణాలను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇలాంటివి నాలుగు పేజీలు చెప్పారు. కడుపులో పుట్టిన బిడ్డ నుంచి మహాలక్ష్మి పథకం వరకు బాబు అందర్నీ మోసం చేశారు.
- నాలుగేళ్ల బాబు పాలనలో మనమంతా సంతోషంగా ఉన్నామా? అని ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్.
- రైతులు సంతోషంగా లేరు. వారికి రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను కూడా రుణమాఫీ పేరుతో బాబు మోసం చేశారు.
- గత ప్రభుత్వాలన్నీ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించేవి. వడ్డీ డబ్బులు ప్రభుత్వమే దగ్గర ఉండి బ్యాంకులకు కట్టేది. దీంతో బ్యాంకులు వడ్డీలేని రుణాలు ఇచ్చేవి. బాబు రాగానే ఆ డబ్బులు కట్టడం మానేశారు.
-ఈ ఆత్మీయ సమ్మేళనంలో మీరు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరిన శ్రీ వైయస్ జగన్.
- పార్టీ అధికారంలోకి వస్తే.. మనం ఏం చేస్తామో.. చెబుతున్నాం. వాటిలో మార్పులు, చేర్పులు సూచించమని ప్రజల్ని కోరిన శ్రీ వైయస్ జగన్.
- మన ప్రభుత్వం పూర్తిగా మహిళల ప్రభుత్వం. ప్రతి పథకం మహిళలను ఉద్దేశించి ఉంటుంది. మనం అధికారంలోకి వస్తే అక్కచెల్లెమ్మలకు భరోసా ఇస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అప్పు మొత్తం ఎన్నికల నాటికి ఎంతైతే ఉంటే.. నాలుగు దఫాలుగా మీ చేతికే ఇస్తాం. ఆ డబ్బు బ్యాంకులకు ఇవ్వం. ఆ డబ్బు మీ చేతికే ఇస్తాం. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకి డబ్బులు కావాలా? వద్దా ? అని ప్రశ్నిస్తే.. కావాలి అంటూ.. మహిళలంతా నినాదాలు చేశారు.
- ఇంజనీరింగ్ చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఫీజులు లక్ష దాటితే.. చంద్రబాబు మాత్రం రూ.35వేలు ముష్టివేసినట్లు ఇస్తున్నారని చాలా మంది విద్యార్థులు తనవద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారన్న శ్రీ వైయస్ జగన్
- ప్రతి సంవత్సరం రూ.65-75 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
- మూడున్నర లక్షలు తెచ్చి అప్పులు చేయటం సాధ్యం కాదు.
- వరదమ్మ, గోపాలరావు అనే భార్యభర్తలు తనను కలిసి పిల్లల చదువుల కోసం డబ్బులు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
- పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి కుటుంబం నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు అయితేనే కుటుంబాలు బాగుపడ్తాయి.
- నాన్నగారి హయాంలో ఇంజనీరింగ్, డాక్టర్లు చదువండని ప్రోత్సహించారు.
- ఈ రోజున పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
- నాన్నగారు పేదవారి కోసం ఒకడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని ప్రకటించిన శ్రీ వైయస్ జగన్
- మెస్ ఛార్జీలు కోసం ప్రతి ఏటా 20వేలు ఇస్తామని శ్రీ వైయస్ జగన్ ప్రకటన.
- చిన్న పిల్లలు రేపు బడికి పోవాలి. ఈ పిల్లలు బడికి పోతే.. ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తాం. ఆ పిల్లలు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు అయితేనే మన భవిష్యత్తు బావుంటుంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 32శాతం నిరక్షరాస్యత ఉంది. దీనిద్వారా చదువుల విప్లవం వస్తుందన్నారు.
- ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టిస్తానని చంద్రబాబు కట్టిస్తామన్నారు. ఎక్కడా కూడా ఇళ్లు కట్టించలేదు. ఒకవేళ ఎక్కడైనా ఒకటో, రెండో కట్టిస్తే..జన్మభూమి కమిటీలు పంచుకున్నాయన్నారు. రేపు మనందరి ప్రభుత్వం వస్తే.. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇళ్లు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అప్పుడు అది ఆస్తి అవుతుంది. అక్కచెల్లెమ్మలకు అప్పు కావాలన్నా బ్యాంకుల్లో పావలా వడ్డీకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
- అవ్వాతాతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు పింఛన్లు ఇస్తున్నారు. ఓట్లు వేయకపోతే పింఛన్లు ఇవ్వటం లేదని ఈ పరిస్థితులు మారుస్తామని మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.2వేలు పింఛను ఇస్తామని శ్రీ వైయస్ జగన్ తెలిపారు.
- అట్టడుగు పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆ అక్కల కోసం పింఛను రూ.2వేలు ఇవ్వటమే కాకుండా వయస్సును 45 ఏళ్లకే తగ్గిస్తామన్నారు. మిగిలిన వారికి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే అందిస్తామని ప్రకటన చేశారు. ప్రతి అక్కకూ తినడానికి ఇబ్బంది లేకుండా కుటుంబాలు గడిచే పరిస్థితి వస్తాయి.
- ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులైపారుతోంది. బెల్టుషాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు 2018లోనో, 2019లోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు అయ్యాక.. తర్వాత జరిగే ఎన్నికల్లో మద్యాన్ని పూర్తిగా తీసేశాక మీ దగ్గరకి వచ్చి ఓట్లు అడుగుతామన్న శ్రీ వైయస్ జగన్.
- మూడు దశల్లో మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్న వైయస్ జగన్.
- మద్యం తాగాలంటే భయపడే విధంగా ధరలు పెంచుతాం.
- ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా రీహాబిలేషన్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తాం.
ప్యాకేజీ పక్కన పెట్టి.. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ముందుకు రావాలి. 25 మంది ఎంపీలతో రాజీనామా చేయిద్దాం. అప్పుడు హోదా ఎందుకు రాదో చూద్దాం. చంద్రబాబు కు వైయస్ జగన్ సవాల్. ప్రత్యేక హోదాపై పోరాటంలో మాతో కలిసి రండి. మా ఎంపీలతో పాటు మీ ఎంపీలనూ రాజీనామా చేయించండి. హోదా రాకుండా ఎక్కడికి పోతుందో చూద్దాం: వైయస్ జగన్.