చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదు
అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బీసీ సదస్సులో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్
2017-12-09- బీసీ సదస్సులో వైఎస్ జగన్ వ్యాఖ్యలు. నాలుగేళ్ళ చంద్రబాబు పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? ఎన్నికల హామీలలో అనేక అంశాలను ఆయన పొందుపర్చారు. వాటిని అమలు చేయక నిర్లక్ష్యం వహిస్తున్నారు. కురుమలను ఎస్‌టీలుగా గుర్తిస్తానని చంద్రబాబు ప్రకటించారు. బోయలను ఎస్‌టీలుగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు. రజకులు ఎస్‌సీలుగా గుర్తించేందుకు చర్యలన్నారు. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటైనా అమలు అయ్యాయా? వీటిని అమలు చేయకుండా కేంద్రంపై నెపం మోపుతున్నారు. అసెంబ్లీలో మూడు సార్లు తీర్మానాలు చేశారు వాల్మీకుల గురించి.. అంతే కాక తీర్మానం జరగ్గానే కేకులు కట్ చేయాలని .. కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఫోన్లు చేశారు. నిజంగా జరిగిపోయిందన్న ఆయన బిల్డప్ ఇచ్చారు.
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్లు ఇచ్చిందేదీ లేదు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు. చంద్రబాబు లాగా నేను మోసం చేయలేదు. మోసాలకు ఒక స్కెచ్ గీసి అమలు చేస్తున్నాడు చంద్రబాబు. సినిమాలలో లాగా చంద్రబాబు యాక్టింగ్ చేస్తున్నాడు. ధర్మవరంలో 30 రోజులుగా చేనేత కార్మికులు ఆందోళన చేస్తున్నారు. చేనేత కార్మికుల రుణాల మాఫీ అన్నాడు బాబు. ప్రతి చేనేత కార్మికుడికి ఇల్లు కట్టిస్తానని, మగ్గాలు ఇస్తానని చెప్పాడు. లక్ష వరకు వడ్డీ లేని రుణాలిస్తానని చెప్పాడు. ఇవన్నీ అమలు చేయలేదు చంద్రబాబు. వీటిని అమలు చేకుండా చేనేత సబ్సిడీలో కోత .. విధిస్తున్నారని చేనేత కార్మికులు చెబుతున్నారు. ఈస్థితి నుంచి ఎప్పటికి చేనేత కార్మికుల బతుకులు బాగుపడుతాయి? వైయస్సార్ హయాంలో చేనేత కార్మికులు చదువుకోగలిగారు. చంద్రబాబు హయాంలో ఈ పరిస్థితి లేదు. బీసీలపై చంద్రబాబుకు ప్రేమ లేదు. బీసీల అభివ`ద్ది పై నేను అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. బీసీలు తమ చదవుల కోసం అప్పులు పాలు కాకూడదు. బీసీ పిల్లలు పెద్ద చదువులు చదివితేనే అభివ`ద్ది సాధ్యం. చదువుల వల్లే వారి తలరాతలు మారుతాయి. మీ ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ రెండు వేలు చేస్తున్నా
నిరుపేదల పెన్షన్ వయోపరిమితిని 45 సంవత్సరాలు చేస్తాం. ఆరోగ్యశ్రీలో నిరుపేదల వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆ ఖర్చును భరిస్తాం. నవరత్నాల అమలుకు సలహాలుంటే ఇవ్వండి.