13వ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర..
ఎనకండ్ల చేరుకున్న శ్రీ వైయస్ జగన్ .. అడుగడుగునా శ్రీ వైయస్ జగన్ కు జననీరాజనాలు.. శ్రీ వైయస్ జగన్ రాకతో భారీగా తరలివచ్చిన జనం.. అన్న వస్తున్నాడు అంటూ శ్రీ వైయస్ జగన్ కు జనం జేజేలు.. దారి పొడవునా తమ సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు..
విజయవాడ--వైయస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి వ్యాఖ్యలు--
చంద్రబాబు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోంది.. ప్రత్యేక హోదా కోసం పోరాడే వారందరిని అరెస్ట్ చేయడం దారుణం.. ఇది ప్రజాస్వామ్యమా..?నియంత పాలన పాలనా..?ఉద్యమాలను అణచి వేయాలనుకోవడం దారుణం.. ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులు, బినామీలకు దారాదత్తం చేస్తున్నారు..ఆర్టీసీ ఆస్తులను తెగనమ్మే అధికారం మీకెక్కడిది..?: ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి
ప్రజాశీస్సులతో అధికారంలోకి వస్తాం
పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తాం. వచ్చే అక్టోబరులో ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నికలకు 11 నెలల వ్యవది మాత్రమే ఉంది. నాలుగు ఏళ్ల చంద్రబాబు పరిపాలన ఎలా సాగిందో.. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఇది వరకు అనేక హామీలు గుప్పించారు. మోసం చేసే రాజకీయనాయకులకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల హామీలను విస్మరించే వారు అధికారంలో ఉండనివ్వాలా? పొదుపు సంఘాల రుణాలు, బంగారు రుణాలను రద్దు చేస్తానన్నాడాయన. రుణ మాఫీ జరిగిందా? ఒక్క రూపాయి మాఫీ కాలేదు. మోసం చేశాడు. సున్నా వడ్డీ కింద అందాల్సిన రూ 2446 కోట్లను ముఖ్యమంత్రి ఎగ్గొట్టారు
మరో వైపు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు ఏపీలో బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. ఫోను కొడితే మందు... అందే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. మరో వైపు గవర్నమెంటు పాఠశాలలను మూసేస్తున్నారు. మహిళల బతుకులు బాగు పడాలంటే పిల్లలు .. బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలి. మా ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమానికి పెద్ద పీట వస్తాం. పిల్లలకు చదువులు చదివించేందుకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తాం. పిల్లలను బడులకు పంపండి వారిని చదివించే బాద్యత నాది. ప్రతి విద్యార్థికి ఏటా రూ 15 వేలు ఇస్తాం. ఫీజులను మాసర్కారే కడుతుంది. పూర్తిగా మేమే ఫీజులను చెల్లిస్తాం హాస్టళ్లను ఏర్పాటు చేస్తాం. ఫీజులతో పాటు భోజన ఇతర ఖర్చుల కోసం రూ 20 వేలు ఇస్తాం. నిరుపేదలకు నెల సరి పెన్షన్‌ను రూ 2 వేలు ఇస్తాం. పెన్షన్ వయోపరిమితిని 45 సంవత్సరాలకు తగ్గిస్తాం. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాం. టీడీపీ సర్కారు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదు నాలుగేళ్ళలో .. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్ళు కట్టిస్తాం. జన్మభూమి కమిటీల్లాగా కాక గ్రామాలలో సెక్రటేరియట్‌లను ఏర్పాటు చేస్తాం. ఈ సెక్రటేరియట్‌లలో ఆయా సామాజిక వర్గాల నుంచి పది మంది ఉద్యోగులుంటారు. వారే 72 గంటలలోగా సాయాన్ని నిరుపేదలకు అందిస్తారు. పొదుపు సంఘాల అప్పును నాలుగు కంతులలో చెల్లిస్తాం. మద్య నిషేధాన్ని నిషేధించిన తరువాత మీ మద్దతు అడుగుతా.. వచ్చే ఎన్నికలలో... మోడల్ పాఠశాలలో పని చేస్తోన్న టీచర్లకు జీతాలు అందడంలేదు. ఆశా వర్కర్లకు జీతాలు అందడం లేదు.
(సదస్సులో పాల్గొన్న మహిళలు తమ సమస్యలను ప్రతిపక్ష నేతకు వివరించారు)