నేడు ముచ్చింతల్ కు సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్ ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి శంషాబాద్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి చినజీయర్ స్వామి ఆశ్రమానికి జగన్ చేరుకుంటారు. ఆ తర్వాత శ్రీరామనగరంలోని శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకుంటారు.
Tags :