ఆటా తెలుగు మహా సభలలో ఘనంగా వై ఎస్ ఆర్ జయంతి వేడుకలు..
ఆటా తెలుగు సభలలో ఏర్పాటు చేసిన డా. వై ఎస్ ఆర్ జయంతి సభలో అనేక మంది వక్తలు డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహతత్వం, సహాయతత్వం, ప్రజలకు సేవ చేసే తత్వం గురించి మాట్లాడి డా. వై ఎస్ ఆర్ ని గుర్తు చేసుకున్నారు... అదే సమయం లో ఆయన తనయుడు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను కొనియాడారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ జ్ఞానేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ రెప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా శ్రీ రత్నాకర్ పండుగాయల, ఏపీ ఎన్ అర్ టీ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ మేడ పాటి, వైయస్ఆర్ పర్తి మహిళా నాయకురాలు శ్రీమతి పద్మజ రెడ్డి, నాటా పూర్వ అధ్యక్షులు డా. రాఘవ రెడ్డి, అమెరికాలోనే వై ఎస్ ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ రామి రెడ్డి ఆళ్ళ తదితరులు ప్రసంగించారు.
బ్రేక్ ఔట్ సెషన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి డా. వైయస్ఆర్, శ్రీ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి, ప్రసంగాల మధ్యలో జోహార్ వైయస్ఆర్ నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ రమేష్ రెడ్డి, ఏపీ పొలిటికల్ కమిటీ చైర్ శ్రీ రమేష్ రెడ్డి నిర్వహించారు.