ASBL Koncept Ambience

21న వైఎస్సార్ మత్స్యకార నేస్తం

21న వైఎస్సార్ మత్స్యకార నేస్తం

నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవంనాడు వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం కార్యక్రమం ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. మత్స్యకారులకు లీటరు డీజిల్‌ మీద రూ.6.03 ఉన్న సబ్సిడీని రూ.9కి పెంచామని, దీనికి సంబంధించి 81 పెట్రోలు బంకులను గుర్తించామని ఆయన చెప్పారు. డీజిల్‌ పట్టించుకున్నప్పడే సబ్సిడీ కూడా ఇస్తామని స్పష్టం చేశారు.  వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఉండే సహాయాన్ని రూ.10 వేలకు పెంచామన్నారు. 21న ఈ డబ్బు ఇస్తామని తెలిపారు. గతంలో మెకనైజ్డ్‌, మోటారైజ్డ్‌ బోట్లకు మాత్రమే ఇచ్చే వారని, ఇప్పుడు సముద్రంలో తెప్పలపై వేటకు వెళ్లే వారికీ దీన్ని వర్తింప చేస్తున్నామని సీఎం వివరించారు. 1,32,332 మత్స్యకార కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారని గుర్తించామని చెప్పారు. ముమ్మిడివరంలో ఈ పథకం ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని సీఎం తెలిపారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన డబ్బు కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పారు.

 

Tags :