నంద్యాలలో వైసీపీ తొలి గెలుపు
నంద్యాలలో అధికార యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఆధిపత్యం చెలాయిస్తున్న అధికార పార్టీ టీడీపీ స్పీడ్‌కు ఈసీ బ్రేకులు వేసింది. పోలీసులను ఉపయోగించి.. ప్రతిపక్ష పార్టీ నేతలపై చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఉప ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉందనగా.. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుని.. టీడీపీకి మొట్టికాయలు వేసింది. అధికార పార్టీకి డీఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్ సీపీ నేతలు చేసిన ఫిర్యాదుకు ఈసీ స్పందించింది. డీఎస్పీపై బదిలీ వేటు వేసి.. అధికార పక్షానికి ఝలక్ ఇచ్చింది.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై పోలీసుల సోదాలు, బైండోవర్‌లు ఇలా.. అన్ని వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఈ సమయంలో టీడీపీకి ఈసీ చెక్ చెప్పింది. సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు మేరకు డీఎస్పీ గోపాలకృష్ణపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈసీ ఆదేశాలు జారీ చేసింది
డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేసిన ఫిర్యాదు.. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి కూడా వెళ్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్నాచితకా నాయకుల ఇళ్లపై అర్థరాత్రి సోదాలు అంటూ తలుపు తడుతున్నారని ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. దీంతో డీఎస్పీపై బదిలీ వేటు వేసింది. గోపాలకృష్ణ స్ధానంలో ఓఎస్‌డీ రవిప్రకాశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముగ్గురు పరిశీకులను ఈసీ నియమించడం గమనార్హం! ప్రత్యేక సమయాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని కొందరు వివరిస్తున్నారు.