ASBL Koncept Ambience

ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ కామెంట్స్

ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ కామెంట్స్

ప్రత్యేక హోదా స్వాతంత్య్రం వచ్చాక అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక్క చంద్రబాబుదే. ప్రత్యేక హోదా విలువ చంద్రబాబుకు తెలియదు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి వట్టిచేతులతో తిరిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. కేంద్రంలోను, రాష్ట్రంలోను అదికారంలో ఉండి ప్రత్యేక హోదా, విభజన  హామీలు అమలు చేయించలేని అమసర్ద ముఖ్యమంత్రి చంద్రబాబే.

ప్రత్యేక హోదా తేలేక పోవడం వల్ల గత నాలుగు సంవత్సరాలలో లక్షాముప్పైవేల కోట్ల రూపాయల అప్పుల పాలవవ్వాల్సి వచ్చంది. స్వాతంత్య్రం వచ్చాక 60–70 ఏళ్లలో కేవలం 90 వేల కోట్ల రూపాయల అప్పు తెస్తే ఇప్పుడు కేవలం నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు.

ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూని  చేసిన వ్యక్తి చంద్రబాబు. ఫిరాయించిన వైఎస్సార్సిపి ఎంఎల్‌ ఏలను అనర్హులుగా చేయమంటే నేటికి నిర్ణయం తీసుకోలేదు. ఈ దిష్టిబొమ్మ ముఖ్యమంత్రి. ఢిల్లీలో ఉన్న అహంకారి నరేంద్రమోది ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా కోసం నిరసన తెలియచేస్తున్నారని తెలిసి కూడా కనీసం స్పందించలేదు.కేంద్రం స్పందించని తీరుకు నిరసనగా ఐదుగురు ఎంపిలు రాజీనామాలు చేశాము. ఈరోజు చంద్రబాబు మోసానికి,వంచనకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేపట్టాము. పదిరోజుల క్రితం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఎందుకు చేశారో ఎవరికి తెలియటంలేదు. అన్ని హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరు తెలుసుకోవాలి.జిల్లా కలెక్టర్లకు అదికారంలేని పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది.

కలెక్టర్ల వ్యవస్ద నిర్వీర్యం అయిపోయింది. కంపెనిలకు సిఇఓలు ఉంటారు. కాని మన రాష్ట్ర దౌర్బాగ్యం చంద్రబాబు సిఇఓలాగా వ్యవరిస్తున్నారు తప్పితే సిఎంలా వ్యవహరించడంలేదు. జన్మభూమి కమిటిలను పెట్టి పరిపాలన సాగిస్తూ ప్రభుత్వానికి, పార్టీకి తేడాలేకుండా  చేసారు. జన్మభూమి కమిటిలనుంచి ప్రజలను విముక్తి కలిగించాలంటే వచ్చే ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ను గెలిపించాలి. అబద్దాలతో, రంగులు మారుస్తూ మోసపుమాటలతో ఉన్న చంద్రబాబును తరిమి తరిమికొట్టాలి.

ఎంఎల్‌ ఏ–– ఆర్‌ కె రోజా కామెంట్స్‌ 

పరిపాలన చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది. ప్రధానిమంత్రి నరేంద్రమోది మట్టి,నీళ్లు ఇస్తే జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమి మాట్లాడలేదని దద్దమ్మ మంత్రి దేవినేని ఉమ అంటారు.జగన్‌ మోహన్‌ రెడ్డి నరేంద్రమోదిని ఎలా అవిశ్వాసం ధ్వారా ఢికొన్నారో ప్రజలందరికి తెలుసు.అసలు ఆ మట్టి, నీళ్లు అందుకున్న చేతగాని అసమర్ద ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని ఎలా అందుకున్నారో సమాధానం చెప్పాలి. దద్దమ్మలా మాట్లాడటం కాదు అని దేవినేని ఉమని నిలదీశారు. ప్రజలందరిని వంచనకు గురిచేసిన చంద్రబాబును ప్రజలు తరిమికొడతారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులతో రాజీనామాలు చేయించి నరేంద్రమోదిపై నిరసన తెలియచేసారు.అదే చంద్రబాబు తన ఎంపిలతో రాజీనామాలు చేయించకుండా లాబీయింగ్‌ చేసుకునేందుకు ఉంచారు. వారు రాజీనామాలు చేసేవరకు గ్రామాలకు రానీయకుండా తరిమితరిమి కొట్టాలని పిలుపుఇచ్చారు.

గడికోట శ్రీకాంత్‌ రెడ్డి కామెంట్స్‌ 

ఓ పక్క చంద్రబాబునాయుడు...మరోపక్క నరేంద్రమోది ప్రత్యేకహోదా ఇస్తామని రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించడం, ఉత్తరాంద్రసుజలస్రవంతి వంటి పధకాలతో ఈ ప్రాంతాన్ని అబివృద్ది చేయడానికి దివంగత వైఎస్‌ కృషిచేసారు. ఇదే తీరుగా మీ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు జగన్‌ ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి తనపై కేసులు వస్తాయి రక్షించండి అంటూ ప్రజలను వేడుకుంటున్నాడంటే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉందో ఆలోచించండి. ఆనాడు సోనియాగాందితో కుమ్మక్కు అయి జగన్‌ పై కుట్రపన్ని కేసులు పెట్టించారు. ఈనాడు ఆయన అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు పండి  శిక్ష పడే పరిస్దితి వస్తే ప్రజలను వలయంగా నిలుచోమంటాడు. ఎందుకు నిన్ను రక్షించాలి. రాష్ట్రప్రయోజనాలను పణంగా పెట్టి దోచుకున్నందుకా, హోదా వద్దు, ప్యాకేజి కావాలన్నందుకా, ఎందుకో సమా«ధానం  చెప్పాలి అని చంద్రబాబును ప్రశ్నించారు.

ఎంఎల్‌ ఏ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కామెంట్స్‌ 

చంద్రబాబు రాష్ట్రానికి శనిలా దాపురించాడు.వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో టిడిపి అడ్రస్‌ కోల్పోయే పరిస్దితి నెలకొంది. అందుకే టిడిపి వారు డ్రామాలకు తెరతీశారు.ఎండను సైతం లెక్కచేయకుండా 1900 కిలోమీటర్లు పూర్తి చేసారు. ఇంకా 1100 కిలోమీటర్లు పూర్తి చేస్తారు. కోట్లాది మంది జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని తమ రక్తాన్ని దారపోస్తున్నారు. చంద్రబాబుకు భయంపట్టుకుంది శ్రీకృష్ణజన్మస్దానానికి వెళ్తానానేమోనని. నన్ను లోపలేస్తారు...నన్ను లోపలేస్తారు అని పదే పదే భయపడుతూ చంద్రబాబు వాపోతున్నారు. నిన్ను లోపలేసేవరకు ఊరుకోం. చంద్రబాబు చెబుతూఉంటారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తామని అదే చేస్తాం.జగన్‌ మోహన్‌ రెడ్డి సిఎం అయ్యాక ఒకరిద్దరు గెలిచేలా చేస్తాం. ఎందుకంటే మేం కూడా అసెంబ్లీలో బంతాట ఆడాలి. నీవు...పప్పు గెలవండి....ప్రజలకు మీ సత్తా తెలిసేలా చేస్తాం. కష్టమైనా, నష్టమైనా జగన్‌ కోసం ప్రాణమిచ్చేందుకు లక్షలమంది సైనికులు రెడిగా ఉన్నారు...అలా తయారు చేసారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. చంద్రబాబు మతిస్దిమితం కోల్పోయిఉన్నారు. ఒకటే ఆలోచన వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పులిలాంటి జగన్‌ ను భగవంతుడు ఇచ్చాడు....నాకు మాత్రం పప్పు ని ఇచ్చాడు అని.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి శ్రీఅంబటి రాంబాబు కామెంట్స్‌ 

ప్రత్యేకహోదా కోసం తాను చేసింది తప్పు అని ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాత చంద్రబాబు ధర్మపోరాటం, దీక్షలు చేయాలని అంబటిరాంబాబు డిమాండ్‌ చేసారు. చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని జైలులో పెట్టించడం వంచన కాదా అని ప్రశ్నించారు. తాను ప్రజలకు నాలుగేళ్లుగా చేసిన వంచనకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష చేయడం మరోవంచనగా అబివర్ణించారు.

నీతికి నిజాయితికి మారుపేరని నిప్పులాంటివారని చంద్రబాబు చెబుతుంటారు. కాని నేడు తనను జైలులో వేస్తారేమోనని భయపడిపోతున్నారు. అన్యాయంగా అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకున్నపుడు, కుట్రలు చేసినపుడు జైలుకెళ్లకతప్పదు. నీవంటి వారిని జైలులో పెడతారనేది బహిరంగ రహస్యం. బిజేపి, టిడిపిలు కలసి చేసిన మోసాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వహబోతున్న తరుణంలో నరేంద్రమోది తనను మోసం చేసారని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని తెలిపారు. తాజాగా జగన్‌ బిజేపి కలిసి పోతున్నారంటూ తన మీడియా సంస్దలతో, టిడిపి నేతలతో దుష్ప్రచారం సాగిస్తన్నారు.

సోనియాగాంది తన మాట వినలేదని అక్రమంగా కేసులు పెట్టినా 16 మాసాలు జైలులో పెట్టినా వాటిని ఎదుర్కొన్న ధీరుడు జగన్‌ నీలా (చంద్రబాబు) పిరికిపందకాదు మా నాయకుడు. ప్రజల ఆశిస్సులు మాకున్నాయి. నరేంద్రమోది, చంద్రబాబు మెడలు వంచి ప్రజలు కోరుకుంటున్నది సాధిస్తాం. మా ఎంపిలు ఐదుగురు ఉన్నా రాష్ట్రానికి హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామాలు చేసి నిరాహారదీక్షలు చేసిన ధీరులు మా పార్లమెంట్‌ సభ్యులు. చంద్రబాబు తన వద్ద ఉన్న పార్లమెంట్‌ సభ్యులతో రాజీనామాలు చేయించకుండా వారితో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాబీయింగ్‌ చేస్తూ వంచన చేస్తున్నారు.

వెన్నపూసగోపాల్‌ రెడ్డి కామెంట్స్‌ 

ఆంద్రప్రదేశ్‌ లో పరిపాలన జరగడం లేదు. కమీషన్లు ముడుపులు M.øసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. చంద్రబాబు మోసపు మాటలను నమ్మేస్దితిలో ప్రజలు లేరు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజలందరికి తెలిసిపోయిందన్నారు.  

ఎంఎల్‌ ఏ ఐజయ్య కామెంట్స్‌ 

చంద్రబాబు అబద్దాల కోరు....ఆయన వల్ల రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయింది. ప్రత్యేకహోదాను తన కమీషన్లకోసం ప్రత్యేకప్యాకేజి తెచ్చుకున్నారు. చంద్రబాబు పదే పదే మోసాలు చేస్తుంటారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో ప్రజల కష్టాలు తీర్చారు. షర్మిల కూడా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసారు. వైఎస్‌ జగన్‌ నేడు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర మండుటెండల్లో చేస్తునారు. జగన్‌ ప్రకటిస్తున్న నవరత్నాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు. ఏవైతే హామీలు  ఇస్తున్నారో అవి అమలు చేస్తారు. మహిళలకు, వృద్దులకు రెండువేల పెన్సన్లు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. సాద్యమయ్యే హామీలను మాత్రమే జగన్‌ చేస్తున్నారు.చంద్రబాబులా అబద్దపు హామీలు చేయడం లేదు. జగన్‌ ను సిఎం చేసుకుంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం వస్తుంది.

అంజాద్‌ బాషా కడప ఎంఎల్‌ ఏ కామెంట్స్‌ 

ఈరోజు విశాఖవేదికగా వంచన వ్యతిరేక దీక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్ట ఆద్వర్యంలో చేపట్టడం జరిగింది. రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం,తమకు పదవులు ముఖ్యం కాదు అని పదవులకు రాజీనామాలు చేసి ఆమరణదీక్షలు చేసిన ఐదుగురు పార్లమెంట్‌ సభ్యలు ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గ, రాక్షసపాలన కొనసాగుతోంది. నరేంద్రమోది,చంద్రబాబులు తిరుపతి వేదికగా హామీఇచ్చి పబ్లిక్గా మోసం చేసారు. ఓట్లు అడిగేటపుడు హోదా తెస్తామన్నారుఅదికారంలోకి వచ్చాక హోదా వద్దు ప్యాకేజి చాలు అన్నారు. హోదా అనేది బిక్ష కాదు మన హక్కు అని వెలుగెత్తి చాటిని వ్యక్తి వైఎస్‌ జగన్‌. హోదా ఆంద్రుల ఊపిరి అందుకోసం ఎందాకైనా పోరాడతానని చెప్పారు. ఉద్యోగావకాశాలు రావాలంటే హోదావల్లనే సాద్యం. చంద్రబాబు, నరేంద్రమోది, వెంకయ్యనాయుడు యావత్తు ఆంద్రరాష్ట్ర ప్రజలను మోసం చేసారు.

ఎంఎల్‌ ఏ రవీంద్రనాద్‌ రెడ్డి కామెంట్స్‌ 

నయవంచన పోరాట దీక్ష చంద్రబాబు వంచనకు వ్యతిరేకంగా చేస్తున్నాం.  ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రంలో మోసాలకు పా నరేంద్రమోది మొదటి పాల్పడిన అంశంలో నరేంద్రమోది మొదటి ముద్దాయి అయితే,రెండో ముద్దాయి చంద్రబాబు. చంద్రబాబు మోసానికి మారుపేరు. ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి అదికారంలోకి వచ్చారు.ఇంత దుర్మార్గమైన, దుష్టపరిపాలన, పనికిమాలినపాలన రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదు. ఈ కులం ఆ కులం లేదు అన్ని కులాలను మోసం చేసారు.ఆయన ఆయన కుమారుడు లోకేష్‌ బాగుంటే చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు.ఎక్కడ 13 జిల్లాల్లో ఒక్క పనిచేసిన పరిస్దితి లేదు.కేంద్రం ద్వారా వచ్చే నిధులకు సంబందించిన  పనులు జరిగాయి తప్ప మరేమి జరగలేదు. యూటర్న్‌ తీసుకుంటూ రాష్ట్రంలోనే యూటర్న్‌ అంకుల్‌ గా పేరుతెచ్చుకున్నారు. ఇలా మోసాలకు పాల్పడే చంద్రబాబును మళ్లీ నమ్మితే ఇంటికో విమానం ఇస్తానంటాడు. ఐదుకోట్లమంది పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి  అందరూ కూడా 420 కేసు పెట్టాలి. చంద్రబాబులా రైతులకు రుణమాఫి అని ఒకే ఒక అబద్దం చెప్పిఉంటే జగన్‌ మోహన్‌ రెడ్డి అదికారంలో ఉండిఉండేవారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ కు ప్రజలు అండగా నిలబడతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి రావడం తధ్యం.జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాజన్న రాజ్యం తప్పకుండా రాష్ట్రంలో వస్తుంది.

కన్నబాబు మాజి ఎంఎల్‌ ఏ

చంద్రబాబూ మీరు ప్రత్యేకహోదా గురించి మాట్లాడారంటే నమ్మే పరిస్దితి లేదు. గతంలో మా పార్టీ కార్యకర్తలు ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తే వారిపై కేసులు పెట్టారు.వాటిని ఎత్తివేస్తే హోదా పై మీ చిత్తశుద్ది నిరూపితమవుతుంది. చంద్రన్న వంచన అని పేరు పెట్టుకుని చంద్రబాబు  ఊరూరా తిరిగుతున్నారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఏపాటిదో అందరికి తెలిసింది. మా ఎంపీలు రాజీనామాలుచేసి ఆమరణదీక్షలు చేసారు.మరి మీ ఎంపీలు ఎందుకు రాజీనామాలుచేయలేదు. మీరెందుకు చేయించలేదు. కేంద్రం వద్ద నాలుగు సంవత్సరాలు వంగివంగి దండాలు పెట్టి ఇప్పుడు బోరవిరుచుకుని నిలబడ్డానని చెబితే నమ్మే పరిస్తితి లేదు.

కావలి ఎంఎల్‌ ఏ ప్రతాప్‌ కుమార్‌ రెడి

చంద్రబాబు నిప్పు అంటాడు...ఓటుకు నోటుతో ఎంఎల్‌  ఏలను కొంటాడు. చంద్రబాబుది ఎప్పుడు రెండు నాలుకల ధోరణి. ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తే కేసులు పెడతాడు.తర్వాత తాను అదే ఉద్యమం చేస్తానంటాడు. చంద్రబాబు మీరు ఎన్ని జపాలు  చేసినా దీక్షలు చేసినా  ఎవరూ నమ్మరు. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అదికారంలోకి తెచ్చుకుని జగన్‌ ను ముఖ్యమంత్రిగా చేసుకుని ప్రత్యేకహోదాను సాదించితీరతాం.

గోపాలరెడ్డి కామెంట్స్‌ 

వంచనకుద్రోహానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. 2014 తర్వాత ఏ సామాజిక వర్గానికి ద్రోహం చేయలేదో చెప్పగలరా అని ప్రశ్నించారు. రైతులు, డ్రాక్రామహిళలు, నిరుద్యోగులు, యువత, కృష్ణాపుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇలా ఏం చేసినా అంతా మోసమే. రాజమౌళిని  తీసుకువచ్చి గ్రాఫిక్స్‌ చూపిచ్చి  రాష్ట్రంలోని ఇంజనీర్లను అవమానించారు. చంద్రబాబును దింపివేసే  శక్తి ఒక్క జగన్‌ కు మాత్రమే ఉంది. ఆంధ్రులను ఉన్న ఏకైక నాయకుడు జగన్‌, నయవంచకుడైన చంద్రబాబును బంగాళా ఖాతంలో కలిపివేయాలి.

ఎంఎల్‌ ఏ కాకాని గోవర్దనరెడ్డి కామెంట్స్‌ 

పార్లమెంట్‌ మెట్లు చంద్రబాబు మొక్కాడు.అంటే ప్రజాస్వామ్యం అంటే తనకు గౌరవం ఉందని చెప్పడం. కాని ఆంద్రప్రదేశ్‌ లో 23 మంది ఎంఎల్‌ ఏలను కొనుగోలు చేసి పార్లమెంటరీ సంప్రదాయా లను తుంగలో తొక్కిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. సంవత్సరానికి ఒక్కసారి పండుగల సమయంలో చంద్రన్న కానుక ఇవ్వడంలో మాత్రం సరిగ్గా పనిచేస్తున్నారు.ఎందుకంటే వాటిలో కమీషన్‌ దండుకోవచ్చని. జగన్‌ మోహన్‌ రెడ్డి బి ఫారం ఇస్తే  గెలిచిన నాపై పోటీచేసి ఓడిపోయినవ్యక్తి సోమిరెడ్డికి  జగన్‌ పై అవాకులు చెవాకులు మాట్లాడే నైతిక హక్కు లేదు. నలబై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ప్రజలను ఎన్ని విధాలుగా మోసం చేస్తూ పరిపాలన చేస్తున్నారో చంద్రబాబును చూస్తే అర్దమవుతుంది. రాష్ట్ర చిత్రపటంనుంచి చంద్రబాబును తరిమికొట్టాలి.

ఎంఎల్‌ ఏ కళావతి కామెంట్స్‌ 

నయవంచనకు టిడిపి,బిజేపిల వల్ల ప్రజలు ఎలా గురయ్యారో ఈ నాలుగేళ్ల పాలన చూస్తే తెలుస్తుంది. ప్రత్యేకహోదా రాష్ట్ర అబివృద్దికి అవసరం అని తెలుసుకున్న తర్వాత ఆయాసపడుతూ సైకిల్‌ యాత్రలు చేస్తున్నారు. లోకేష్‌ కు అహగాహన లేకపోయినా రెండు పోర్ట్‌ ఫోలియోలు కేటాయించారు. దానివల్ల ఆ శాఖలపరిదిలో అభివృద్ది నిలిచిపోతుంది. ప్రజలను మోసం చేసే ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి. జగన్‌ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా ప్రజలందరికి మేలు జరుగుతుంది.

 

 

Tags :