ASBL Koncept Ambience

యూత్‌ మెచ్చేలా జిలేనియల్‌ కార్యక్రమాలు

యూత్‌ మెచ్చేలా జిలేనియల్‌ కార్యక్రమాలు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి.ఈ సంబరాల్లో వివిధ వర్గాలు మెచ్చేలా కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. ఇందులో భాగంగా జిలేనియల్‌ యాక్టివిటీస్‌లో ఎన్నో కార్యక్రమాలను మీరు చూడవచ్చు.

*  26వ తేదీన యూత్‌ కోసం క్రూయిజ్‌ యాత్రను ఏర్పాటు చేసారు. సెలబ్రిటీ గెస్ట్‌తో, కమెడియన్లతో, డిన్నర్‌, డ్యాన్స్‌లతో విహారయాత్ర చేయవచ్చు.

*  27వ తేదీన సంబరాలకు వచ్చిన తెలుగు సెలబ్రిటీలతో మీరు చిట్‌ ఛాట్‌ చేయవచ్చు. కాఫీ, టీ తాగుతూ మీకిష్టమైన, మీ ఫేవరెట్‌ సెలబ్రిటీతో మీరు ఛాట్‌ చేసే అవకాశాన్ని నాట్స్‌ సంబరాల్లో కల్పిస్తోంది.

*  తెలుగు షార్క్‌ ట్యాంక్‌ పేరుతో బిజినెస్‌ చేయాలనుకునే వాళ్ళకోసం అవకాశాన్ని నాట్స్‌ సంబరాల్లో కల్పిస్తోంది. తెలుగు ఎంట్రప్రెన్యూర్స్‌ తమ బిజినెస్‌ ప్రపోజల్స్‌తో ఈ కార్యక్రమంలో చర్చించవచ్చు.

*  స్పీడ్‌ డేటింగ్‌ పేరుతో తమకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయిని ఎంచుకోవచ్చు.

*  నెక్ట్‌ జనరేషన్‌ లీడర్‌ షిప్‌ ప్యానెల్‌..యంగ్‌ తెలుగు ప్రొఫెషనల్స్‌కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

*  28వ తేదీన ఆదివారం నాడు కూడా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

* టాలెంట్‌ కాంపిటీషన్స్‌ పేరుతో జరిగే పోటీల్లో పాల్గొని నగదు బహుమతులను ఛాన్స్‌లను అందుకోవచ్చు.

*  తెలుగు ట్రివియా పేరుతో జరిగే కార్యక్రమంలో మీ నాలెడ్జ్‌కు జరిపే పరీక్షలో గెలిచి నగదు బహుమతులను చేజిక్కించుకోవచ్చు.

*  జడ్‌ అడ్వెంచర్స్‌ కార్యక్రమం, వెల్‌ బియింగ్‌ ప్యానెల్‌ పేరుతో కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

 

 

Tags :