ఆటా 2వ రోజు మహాసభలు ఘనంగా ప్రారంభం

ఆటా 2వ రోజు మహాసభలు ఘనంగా ప్రారంభం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభలు 2వ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం ఈ మహాసభలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైజాగ్‌ ఎంపి ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిధులుగా మహాసభలు ప్రారంభమయ్యాయి. వేదాశీర్వచనంతో అధ్యక్షుడు భువనేష్‌ బుజాల దంపతులను, కన్వీనర్‌ సుధీర్‌ బండారు దంపతులను, కోకన్వీనర్‌ కిరణ్‌పాశంను శాలువాతో పూలమాలతో ఆశీర్వదించారు. కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.

ఆటా అధ్యక్షులు శ్రీ భువనేశ్ భూజల మాట్లాడుతూ కోవిడ్ తరువాత చేసే ఈ సభలు ఒక పెద్ద తెలుగు పండుగ లాగా చేయాలని ఒక సంవత్సరం నుంచి పూర్తి ప్రణాళిక తో పనిచేశానని, రెండు తెలుగు రాష్ట్రాలనుంచి, అమెరికా లోని అన్ని రాష్ట్రాల నుంచి తెలుగు వారు, ఎందరో ప్రముఖులు ఇప్పుడు ఇక్కడికి వచ్చారని వారందరికీ ధన్యవాదాలు చెపుతూ ఆటా తరుపున స్వాగతం తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి ని కాపాడుకొంటూ ముందు తరానికి ఇవ్వాల్సిన భాధ్యత మనందరి మీద వుందని, ఈ ఆటా మహా సభల లక్ష్యం కూడా అదేనని అన్నారు. 

ఆటా మహా సభల కన్వీనర్ శ్రీ సుధీర్ బండారు మాట్లాడుతూ 80 కమిటీలు, 400మంది సభ్యులు, అనేక మంది వాలంటీర్లు ఈ మహాసభలు విజయ వంతం గా నిర్వహించటానికి పని చేస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాన్ఫరెన్స్ కి ఇంత పెద్ద సంఖ్య లో వచ్చిన తెలుగు వారికి, కాన్ఫరెన్స్ నిర్వహణ కు ముందుగానే తమ సపోర్ట్ గా విరాళాలు ఇచ్చిన దాతలకు, స్పాన్సర్లు కి కృతజ్ఞతలు తెలిపి, స్వాగతం చెప్పారు.


Click here for Event Gallery

 

 

 

 

Tags :