ప్రవాసాంధ్రుల సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం

ప్రవాసాంధ్రుల సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ తొలిసారి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఆగస్టు 15న బయలుదేరి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన డల్లాస్‌లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (కే బెయిలీ హచీసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌) లో ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఒక సమావేశం నిర్వహించాని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరు కావడానికి జగన్‌ అంగీకరించినట్టు తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా తెలిపింది. అమెరికాలో తెలుగు వారి కోసం పని చేస్తున్న ఆయా సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (టీసీఎన్‌ఏ) తెలిపింది.

 

 

Tags :