కరోనా హాట్ స్పాట్ లలో ర్యాండమ్ పరీక్షలు చేయండి - జగన్

కరోనా హాట్ స్పాట్ లలో ర్యాండమ్ పరీక్షలు చేయండి - జగన్

హాట్‍స్పాట్‍లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్‍గా సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్‍ జగన్‍మోహన్‍రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్‍ జగన్‍ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎస్‍ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‍ సవాంగ్‍, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‍ సీఎస్‍ జవహర్‍రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‍ వ్యాప్తి నియంత్రణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ల్యాబ్‍ సౌకర్యాలు, ఆస్పత్రుల్లో ఐసోలేషన్‍ బెడ్స్ పెంపుపై చర్చించారు.

అనంతరం సీఎం వైయస్‍ జగన్‍ మాట్లాడుతూ.. హాట్‍స్పాట్‍లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్‍ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‍ క్యాంపుల్లో అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. కోవిడ్‍ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్‍ఓపీ ప్రమాణాలను పాటించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వేగవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు వలంటీర్లు, ఏఎన్‍ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్న వారి గుర్తించాలని ఆయన సూచించారు.  విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్‍ కడప జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‍ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీ మెడిసిన్‍ సర్వీసులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఐసోలేషన్‍లో ఉన్న వారు ఎవరైనా ఫోన్‍ చేసి వైద్యం పొందవచ్చని అన్నారు. క్వారంటైన్‍, ఐసోలేషన్‍ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగు పరచాలని, సదుపాయాల్లో నాణ్యత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.

 

Tags :