మధ్యాహ్న భోజన పథకానికి మెరుగులద్దిన జగన్ ప్రభుత్వం

మధ్యాహ్న భోజన పథకానికి మెరుగులద్దిన జగన్ ప్రభుత్వం

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖపై ప్రత్యేక దష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు మొదలు పెట్టారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలు ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే సదాశయంతో సమూల మార్పులు చేస్తున్నారు.

రుచికి, శుచికి ప్రాధాన్యం ఇస్తూ కమ్మని వంటలను వండి పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని నామమాత్రంగా అమలు చేయడంతోపాటు ఏనాడూ రుచికరంగా అందించలేదనే విమర్శలు ఉన్నాయి. వీటితోపాటు పర్యవేక్షణ కూడా కొరవడి.. వంట నిర్వాహకులు పెట్టిందే మెనూ వండిందే తిను అనే తరహాలో సాగిందనే చెప్పాలి. ఇక మీదట వాటికి స్వస్తి పలికి విద్యార్థులు అర్ధాకలితో కాకుండా కడుపునిండా తిని  చదువుపై దష్టి సారించే విధంగా.. ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు.

 

Tags :