వైఎస్‌ఆర్‌ లా నేస్తం ప్రారంభం

వైఎస్‌ఆర్‌ లా నేస్తం ప్రారంభం

వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అదేవిధంగా ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించి.. లబ్ధిదారులైన న్యాయవాదులకు ప్రతినెలా రూ.5వేలు ప్రభుత్వం జమ చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరు పైనా, న్యాయవాదుల సంక్షేమం కోసం చట్టంలో సవరణలు తీసుకొస్తున్నందుకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, వైఎస్‌ చైర్మన్‌ రామజోగేశ్వరరావు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు రామిరెడ్డి, సీనియర్‌ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు ఉన్నారు.

 

 

Tags :