పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ లో మంత్రి కేటీఆర్‌ పలు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలిశారు. ప్రముఖ ఫార్మా కంపెనీ రోషే సంస్థ చైర్మన్‌ క్రిస్టోఫర్‌ ప్రాన్జ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ ఫార్మా హబ్‌గా ఉందని, ఫార్మా సిటీ, మెడికల్‌ డివైస్‌ పార్కుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. హెచ్‌పీసీవోవో విశాల్‌ లాల్‌, అపోలో టైర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీరజ్‌ కన్వర్‌, కాల్ల్స్‌ బెర్గ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఫ్లెమింగ్‌ బెసెన్‌ బాచర్‌, పీఅండ్‌జీ దక్షిణాసియా సీఈవో మాగేశ్వరన్‌ సురంజన్‌, పిరమల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు.

Click here for Phtogallery

Tags :