మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో ఆటా నాయకులు... కాన్ఫరెన్స్ కు రావాల్సిందిగా ఆహ్వానం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో ఆటా నాయకులు... కాన్ఫరెన్స్ కు రావాల్సిందిగా ఆహ్వానం

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ) 17వ మహా సభలు, యూత్‌ కన్వెన్షన్‌ కు అతిథిగా రావాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుని ఆ సంఘం ప్రతినిధులు జయంత్‌ చల్లా, శరత్‌ వేముల, రఘువీర్‌ రెడ్డి, భువనేశ్‌ బుజాల, సన్నీ రెడ్డి తదితరులు ఆహ్వానించారు. హైదరాబాద్‌ లోని మంత్రి నివాసంలో ఆటా ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1990లో ఏర్పడిన ఈ సంఘం అమెరికాలో తెలుగు కళలు, సంప్రదాయాలు, సంస్కృతీ పరిరక్షణకు పాటుపడుతున్నదన్నారు. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ మహా సభలలో వివిధ రంగాలకు చెందిన తెలుగు వాళ్ళని పిలిచి వివిధ అంశాలపై చర్చిస్తామని తెలిపారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, ఆటా సభలకు తాను గతంలోనూ వెళ్ళానన్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా పండుగగా గొప్పగా నిర్వహించుకునే ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని అంటూ, ఆటా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ, తాను తప్పక వస్తానని హామీ ఇచ్చారు.

 

Tags :