‘ఆటా’ ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు

‘ఆటా’ ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అధ్యక్షులు భువనేష్‌ బుజాల, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు మరియు అన్ని కమిటీల సభ్యులు వాషింగ్టన్‌ డీసీలో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్న ఆటా 17వ కన్వెన్షన్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌ కొరకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఆటా అధ్యక్షులు భువనేశ్‌ భుజాల మాట్లాడుతూ యూత్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా అన్ని కమిటీల సభ్యులు పరస్పరం సహకరించుకొని ఈ ఆటా 17వ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు ఒక్కొక్క కమిటీ ల సభ్యుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కాన్ఫరెన్స్‌ విజయవంతంకోసం వివిధ ప్రచార కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. మే 8, 2022 ఆదివారం రోజున మదర్స్‌ డేని పురస్కరించుకొని కాన్ఫరెన్స్‌ కల్చరల్‌ ఛైర్‌ దీపికా బుజాల, కాన్ఫరెన్స్‌ కల్చరల్‌ అడ్వైజరీ సాయికంత రాపర్ల, కాన్ఫరెన్స్‌ సయ్యంది పాదం ఛైర్‌ సుధారాణి కొండపు, మహిళా స్పోర్ట్స్‌ కో-ఛైర్‌ ప్రశాంతి ముత్యాల అందరూ వర్జీనియాలో కేక్‌ కట్‌ చేసి ఘనంగా సెలబ్రేట్‌ చేసుకొన్నారు. అలాగే కాలిఫోర్నియాలోని శాండియాగోలో వుండే ఆటా మహిళలు అందరూ కేక్‌ కట్‌ చేసి మదర్స్‌ డేని విజయవంతంగా సెలబ్రేట్‌ చేసుకొన్నారు.

 

Tags :